వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్డూ భాయ్ భార్యకు బీజేపీ టికెట్, జామ్ నగర్ నుంచి బరిలోకి రివాబా జడేజా

|
Google Oneindia TeluguNews

గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక కోసం బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఆ 100 మందిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా కూడా ఉన్నారు. టికెట్ల కేటాయింపును బీజేపీ ఆచి తూచి ఎంపిక చేసింది. చాలా మంది కొత్తవారికే అవకాశం కల్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 38 మందికి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పలువురు నేతలకు టికెట్ ఇచ్చారు.

నార్త్ జామ్ నగర్ నుంచి రివాబా జడేజా పోటీ చేస్తారు. రవీంద్రా జడేజాతో రీవాబాకు 2016లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. పార్టీలో ఉత్సాహంగా పని చేస్తున్నారు. కర్ణి సేన నాయకురాలు కూడా.. ప్రముఖ రాజకీయ నేత హరిసింగ్ సోలంకికి రీవాబా దగ్గరి బంధువు అవుతారు. రివాబా జడేజా 1990 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అత్మియ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలీజీ అండ్ సెన్స్ కాలేజీలో పూర్తి చేశారు. పెళ్లయ్యాక.. బీజేపీలో చేరారు.

Gujarat Assembly polls: Cricketer Ravindra Jadejas wife Rivaba get BJP ticket

గత కొన్ని నెలల క్రితం పార్టీలో చేరిన హర్థిక్ పటేల్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. అలాగే మోర్బి ఘటన సమయంలో నదిలోకి దూకి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ట్రై చేసిన మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్‌కు మళ్లీ టికెట్ కేటాయించింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన 89 నియోజకవర్గాలకు 5 వ తేదీన 93 నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. డిసెబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికలో ఆరో సారి గెలిచి.. అధికారం చేపడుతామని బీజేపీ ధీమాతో ఉంది. గుజరాత్ పోల్‌పై ఆప్ కూడా ఆశలు పెట్టుకుంది. అధికారం చేపడుతామని అంటోంది. కాంగ్రెస్ పార్టీ అంతగా ప్రభావం చూపకోవచ్చు. ఆ పార్టీ ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది.

English summary
Rivaba Jadeja, wife of indian cricketar Ravindra Jadeja, gets a BJP ticket from Jamnagar North for the Gujarat Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X