బీజేపీకి శుభ సంకేతం: గుజరాత్ ఉపపోరులో ఘన విజయం

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్‌: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఉపఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. గుజరాత్‌ స్ధానిక సంస్థల ఉపపోరులో బీజేపీ దూసుకెళ్లింది.

మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఏడు జిల్లాల పరిధిలోని ఏడు మున్సిపాలిటీలకు గాను ఐదింట బీజేపీ విజయం సాధించింది. వీటికి తోడు ఒక తాలూకా పంచాయితీలోనూ బీజేపీ గెలుపొందింది.

Gujarat by-election: Ruling BJP wins 5 of 7 municipality seats, one taluka panchayat seat

తాజాగా ఉప ఎన్నికలు జరిగిన ఎనిమిది చోట్ల గతంలో బీజేపీ కేవలం రెండు సీట్లలోనే గొలుపొందింది. దీంతో బీజేపీ బలం మూడు రెట్లు పెరగ్గా, గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ గెలుచుకున్నమున్సిపాల్టీల సంఖ్య సగానికి పడిపోయింది.

బొరైవి, మహుధ, విజపూర్‌, పటాన్‌, తలాలా మున్సిపాల్టీల్లో బీజేపీ గెలుపొందిం‍ది. గాంధీనగర్‌ జిల్లాలోని రంధేజా తాలూకా పంచాయితీ సీటునూ ఆ పార్టీ కైవసం చేసుకుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో స్థానిక ఉప పోరులో సానుకూల ఫలితాలు రావడం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bharatiya Janata Party has won 5 of 7 municipality seats across 7 municipalities in the Gujarat by-poll results declared today. These 7 municipalities were spread across 7 districts of the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి