అహ్మద్ పటేల్‌కు ఐసీస్ ఉగ్రవాదితో సంబంధాలు: సీఎం సంచలన ఆరోపణ

Subscribe to Oneindia Telugu

గాంధీనగర్‌: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన ఆరోపణలు చేశారు.
ఇటీవల అరెస్టయిన ఐసిస్‌ ఉగ్రవాదితో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. వెంటనే పటేల్‌ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేశారు.

రెండ్రోజుల క్రితం గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌(ఏటీఎస్‌) అధికారులు ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరైన ఖాసీం స్టింబర్వాల సర్దార్‌ పటేల్‌ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆ ఆస్పత్రికి కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

Gujarat CM Vijay Rupani links ISIS terrorist with Ahmed Patel, Congress says 'Completely baseless'

ఈ విషయంపై సీఎం రూపానీ మాట్లాడుతూ.. 'ఆ ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పటేల్‌, రాహుల్‌గాంధీ దీనిపై తప్పకుండా వివరణ ఇచ్చుకోవాలి. రాజ్యసభ ఎంపీ పదవి నుంచి పటేల్‌ వైదొలగాలి. అరెస్టు అవడానికి రెండు రోజుల ముందే ఖాసీం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అటువంటి వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారనే విషయాన్ని పటేల్‌ చెప్పాలి.' అని నిలదీశారు.

కాగా, గుజరాత్ సీఎం ఆరోపణలపై అహ్మద్‌ పటేల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. 'ఏటీఎస్‌ అధికారులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని మా పార్టీ అభినందిస్తుంది. వారిపై విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలి. నాపై బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ఇవి జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు. వీటిని రాజకీయం చేయొద్దు.' అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gujarat Chief Minister Vijay Rupani stirred the political cauldron in the poll bound-state after he made a sensational charge against Congress leader Ahmed Patel on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి