బంపర్ ఆఫర్: 20 మంది ఎమ్మెల్యేలతో సహా వస్తే చీఫ్ మినిస్టర్, డిప్యూటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే

గుజరాత్ అసెంబ్లీ పరిసరాల్లో సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు కాంగ్రెస్ నేత గాలెం వేసేందుకు ప్రయత్నించారు. నితిన్ పటేల్ సహా 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరితే సీఎం పోస్టు ఇస్తామని పేర్కొన్నారు. ఇరువురి మధ్య జరిగిన సంభాషణ బయటకు పొక్కడంతో సోమవారం అసెంబ్లీ లాబీల్లో చర్చకు దారితీసింది.

గుజరాత్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం కొశ్చన్ అవర్ జరుగుతోంది. ఇంతలో లాతీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్‌జీ తుమార్నే.. నితిన్ పటేల్‌తో సంప్రదింపులు జరిపారు. తమ పార్టీలోకి వస్తే అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇది బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలను తీసుకొచ్చిందని కమలదళ నేతలు అంటున్నారు. ఇదేమీ కాదని.. విశ్వ ఉమియా ధామ్ కార్యక్రమంలో నితిన్ పటేల్ చేసిన ప్రకటనతోనే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన తీసుకొచ్చిందని హస్తం నేతలు చెప్తున్నారు. వివాదానికి కేంద్ర బిందువైన నితిన్ పటేల్ మాత్రం.. తాను అందరిముందు ఒంటరిగా నిలబడుతానని పేర్కొన్నారు.

Gujarat Congress MLA offers deputy CM Nitin Patel cm if..

సాధారణంగా రాజ్యసభ ఎన్నికలకు ముందు.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వ్యుహాలు అమలు చేస్తుంటారు. కానీ ఈసారి ఏకంగా డిప్యూటీ సీఎంపైనే కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు దింపేందుకు ప్రయత్నించడం ఆసక్తి కలిగిస్తోంది. దీనిపై గుజరాత్ బీజేపీ చీఫ్ స్పందిస్తూ.. నితిన్ పటేల్‌ను లక్ష్యగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+