గుజరాత్ బరిలో మాజీ సీఎంలు.. ఎమ్మెల్యేలు, ఎంపీల వారసులు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: ప్రతి ఎన్నికల్లో నాయకులు తమ వారసులు, జీవిత భాగస్వాములను బరిలో నిలుపడం సహజంగా మారింది. ప్రత్యేకించి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ కళంకితులైన ఎమ్మెల్యేల భార్యలు, మాజీ సీఎంల తనయులు, ఇతర బంధువులు ప్రధానంగా మారింది. ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేసులు, ఇతర సమస్యల్లో చిక్కుకున్న వారు తమ భార్యలు, కోడళ్లు, కూతుళ్లను తమకు బదులు ఎన్నికల బరిలో నిలుపడం ఆనవాయితీగా మారుతోంది.
మాజీ సీఎం మాధవ్ సింగ్ సోలంకీ తనయుడు గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకీ మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. భరత్ సింగ్ సోలంకీ బావ మరిది అమిత్ చావ్డా తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్న వారసుల్లో ఒకరిగా ఉన్నారు. ఇక మరికొందరు నాయకులు తమ కోడళ్లను బరిలోకి దించుతున్నారు. వారిలో కొందరి విశేషాలు పరిశీలిద్దాం..

లునావాడలో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ అల్లుడు

లునావాడలో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ అల్లుడు

పరంజితాదిత్య సిన్హ్భూషణ్ భట్ సిట్టింగ్ ఎమ్మెల్యే.. జమల్పూర్ ఖడియా మాజీ ఎమ్మెల్యే ప్లస్ మాజీ స్పీకర్ అశోక్ భట్ తనయుడు. 2010 సెప్టెంబర్ నెలలో స్పీకర్ హోదాలోనే మరణించాడు. అంతకుముందు సోషలిస్టుగా ఉన్న అశోక్ భట్ 1980లో బీజేపీలో చేరారు. ఖాడియాలో గెలుపొందినప్పటి నుంచి తర్వాత మారిన జమల్పూర్ స్థానం నుంచి గెలుపొందుతూ వచ్చారు.
ప్రముఖ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పరంజితాదిత్యాసిన్హ్ ఎస్ పర్మార్.. లునావాడా అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ శాంత్రాంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. లునావాడా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొపెసర్ హీరాభాయి పటేల్ స్థానే పరంజిత్యాదిత్య సిన్హ్ ఎస్ పర్మార్‌ను అభ్యర్థిగా నిలిపారు. అయితే పార్మార్‌పై స్థానికేతరుడన్న ముద్ర ఉంది.

 ఎంపీ ఏకే పటేల్ సోదరుడు అతుల్ కే పటేల్ కూడా పోటీ

ఎంపీ ఏకే పటేల్ సోదరుడు అతుల్ కే పటేల్ కూడా పోటీ

పాటిదార్ స్ట్రాంగ్మన్, పోర్ బందర్ ఎంపీ విత్తల్ రాడాడియా కొడుకు జయేశ్ రాడాడియా. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన జయేశ్ ప్రస్తుతం జత్పూర్ ఎమ్మెల్యే కూడా. 2014లో తండ్రీ కొడుకులిద్దరూ బీజేపీలో చేరారు. పొర్ బందర్ నుంచి విత్తల్ రాడాడియా గెలుపొందగా, జయేశ్‌కు ప్రస్తుతం జత్పూర్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు టిక్కెట్ లభించింది.
గతంలో ఆరుసార్లు ఎంపీగా డాక్టర్ ఏకే పటేల్ మాజీ మంత్రి కూడా. 1984లో బీజేపీ గెలుపొందిన ఇద్దరు ఎంపీల్లో ఒకరు లాల్ క్రుష్ణ అద్వానీ అయితే మరొకరు ఏకే పటేల్. ఆయన సోదరుడు డాక్టర్ అతుల్ కే పటేల్.. కలోల్ ఎమ్మెల్యే స్థానానికి బరిలో నిలిచారు.

కొడుక్కు టిక్కెట్ తెచ్చుకున్న ఇంద్రజిత్ నట్వర్ సింగ్

కొడుక్కు టిక్కెట్ తెచ్చుకున్న ఇంద్రజిత్ నట్వర్ సింగ్

1990 నుంచి మహుడా నుంచి ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇంద్రజిత్ నట్వర్ సిన్హ్ పార్మార్ ఆ పార్టీకి పెద్ద దిక్కు. గత ఆగస్టు నెలలో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ఎన్నిక కావడానికి సహకరించిన, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వారిలో ఇంద్రజిత్ నట్వర్ సిన్హ్ పార్మార్ ఒకరు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విధేయతగా తన కొడుక్కు టిక్కెట్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా పని చేసిన అమరిసింగ్ చౌదరి తనయుడు డాక్టర్ తుషార్ చౌదరి. మాహువా ఎస్టీ కోటాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఆయనకు రాజకీయాలేం కొత్త కాదు. 2009 ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికైన తుషార్ చౌదరి ఎన్నికవ్వడంతోపాటు యూపీఏ మలి విడత ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

 మాజీ సీఎం చిమన్ బాయి కొడుకు సిద్ధార్ద పటేల్ ఇలా పోటీ

మాజీ సీఎం చిమన్ బాయి కొడుకు సిద్ధార్ద పటేల్ ఇలా పోటీ

గొండాల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జైరాజ్ సింగ్ జడేజా భార్య గీతాబా జడేజా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీజేపీ కార్యకర్త నీలేశ్ రైయానీ హత్య కేసులో జైరాజ్ సింగ్‌కు గత ఆగస్టులో గుజరాత్ హైకోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. గుజరాత్ రాష్ట్రానికి బయటకు వెళ్లరాదన్న షరతుపై సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుజరాత్ మాజీ సీఎం చిమన్‌బాయ్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ ఉర్మిళా పటేల్ తనయుడు సిద్దార్థ పటేల్.. 1998 నుంచి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికవ్వగా, రెండుసార్లు ఓటమి పాలయ్యారు. గుజరాత్ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా సిద్దార్థ్ పటేల్, పీసీసీ ఎన్నికల ఇన్ చార్జీగా ఉన్నారు.

 గాంధీగామ్ నుంచి ఎమ్మెల్యే మేనకోడలు మాలతీ పోటీ

గాంధీగామ్ నుంచి ఎమ్మెల్యే మేనకోడలు మాలతీ పోటీ

గుజరాత్ మాజీ సీఎం మాధవ్ సింగ్ సోలంకి మేనల్లుడు అమిత్ చావ్డా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుత గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి బావ మరిది అమిత్ చావ్డా. ఆయన ఆనంద్ జిల్లా అంక్లావ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. అంతే కాదు ఆయన తాత ఈశ్వర్ భాయి చావ్డా మనుమడు కూడా. ఆనంద్ ఎంపీగా కొన్నేళ్ల పాటు ఈశ్వర్ భాయి చావ్డా పని చేశారు.
కచ్ ప్రాంతం గాంధీదామ్ ఎమ్మెల్యే రమేశ్ మహేశ్వరి మేన కోడలు మాలతీ మహేశ్వరి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. ఆమె తండ్రి రాంజీ గెడా కూడా బీజేపీ నాయకుడే. గాంధీగామ్ మున్సిపల్ కౌన్సిలర్ కూడా. కానీ మాలతీ మహేశ్వరి మాత్రం తొలిసారి ఎన్నికల్లో పాల్గొంటున్నారు.

 రాజులా నుంచి మంత్రి సోలంకి సోదరుడు

రాజులా నుంచి మంత్రి సోలంకి సోదరుడు

నాండోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే భాయిలాల్ తాడ్వి తనయుడు శబ్దాశరణ్ తాడ్వి ప్రస్తుతం ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. తాడ్వి సామాజికవర్గ జనాభా గల నియోజకవర్గం నాందోడ్ అసెంబ్లీ సెగ్మెంట్. ఆయన ఎదుగుదలలో శబ్దాశరణ్ తండ్రి భాయిలాల్ తాడ్వి బీజేపీ కీలకంగా వ్యవహరించిందని తెలుస్తున్నది.
రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం సోలంకీ సోదరుడు హీరాభాయి సోలంకి ప్రస్తుత ఎన్నికల్లో రాజులా నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పురుషోత్తం సోలంకీ ‘కోలీ' సామాజికవర్గంలో పేరున్న నాయకుడు. కేశుభాయి పటేల్ హయాం నుంచి మంత్రిగా ఉన్నారు పురుషోత్తం సోలంకి. పురుషోత్తం సోలంకి, ఆయన సోదరుడు హీరాబాయి 1998 నుంచి ఎమ్మెల్యేలుగా పని చేస్తున్నారు.

 బొర్సాడ్ నుంచి ఎమ్మెల్యే తనయుడు శైలేశ్ పోటీ

బొర్సాడ్ నుంచి ఎమ్మెల్యే తనయుడు శైలేశ్ పోటీ

దేడియాపాడా అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చోటు వాసవ కొడుకు మహేశ్ వాసవ పోటీ చేస్తున్నారు. యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) నుంచి అసెంబ్లీకి 2007, 2012 ఎన్నికల్లో గెలుపొందారు. గత ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో కీలక భూమిక పోషించారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా భారతీయ ట్రైబల్ పార్టీ పేరుతో తిరిగి పోటీ చేస్తున్నారు. తండ్రీ కొడుకులిద్దరికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతోంది.
బొర్సాడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్ర సిన్హ్ పార్మార్.. మాజీ ఎమ్మెల్యే ధిర్సింగ్ పార్మార్ తనయుడు. ధిర్సింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గతంలో ప్రాతినిధ్యం వహించారు. ధిర్సింగ్ పార్మార్ ‘అమూల్' సంస్థలో ఖేడా యూనియన్‌కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల్లో భద్రన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 2012లో బొర్సాద్ స్థానం నుంచి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మనుభాయి శైలేశ్ పార్మార్ కుమారుడు శైలేశ్ పార్మార్ ప్రస్తుతం ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పేరు ఉన్న దళిత నాయకుడు మనుభాయి పటేల్. శైలేశ్ పార్మార్ తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన షాహెర్ కోట్డా అసెంబ్లీ స్థానం నుంచి 2000లో, తర్వాత దనిల్మియా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Today dynasty politics common in Indian Political context while Gujarat also same page. Three ex CM's Chimanbhai Patel, Madhav Singh Solanki and Amarinder singh Chowdary sons, nephews are in fray but Bharat Singh Solanki didn't contest polls.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి