ఓపీనియన్ పోల్: గుజరాత్‌లో ఏకపక్షమే, మళ్లీ బీజేపీనే

Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజారత్‌లో మరోసారి బీజేపీ అధికారం చేపట్టనుంది. ఈ మేరకు సీఎస్‌డీఎస్-ఏబీపీ న్యూస్ సర్వే వివరాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన మేజార్టీని సాధిస్తుంది.

బీజేపీకి 113-121సీట్లను గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. ఓటు షేర్ కూడా 47శాతం వరకు ఉంటుందని వెల్లడించింది. మోడీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటమిని చవిచూడనుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 58-64సీట్లు వస్తాయని పేర్కొంది. 41శాతం ఓటు షేర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తుందని తెలిపింది.

 Gujarat election opinion poll: BJP all set to retain power via landslide win, shows survey

బీజేపీ గెలుపు ఖాయమని.. విజయ్ రూపాని ముఖ్యమంత్రి పదవిని అలంకరించడం కూడా ఖాయమని తెలిపింది. కాగా, ఉత్తర గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఓటర్లు ఉన్నారని తెలిపింది. బీజేపీకి 44శాతం ఓటు షేర్ ఉండగా, కాంగ్రెస్ పార్టీకి అక్కడ 49శాతం ఓటు షేర్ వస్తోందని వెల్లడించింది.

సెంట్రల్ గుజరాత్‌లో మాత్రం బీజేపీకి 54శాతం ఓట్లు వచ్చే అవకాశాలుండగా, కాంగ్రెస్ పార్టీకి 38శాతమే ఓట్లు పడే అవకాశం ఉంది. దక్షిణ గుజరాత్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉందని తెలిపింది. బీజేపీ అక్కడ 51శాతం ఓటు షేర్ ను కలిగి వుంది. కాంగ్రెస్ మాత్రం 33శాతమే దక్కించుకోనుంది.

డిసెంబర్ 9, 14లలో రెండు దశలుగా ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోకసభ ఎన్నికల నేపథ్యంలో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీని మరోసారి అధికారంలో నిలబెట్టేందుకు ఇప్పటికే అమిత్ షా గుజరాత్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If the opinion poll predictions are anything to go by, the Bharatiya Janata Party (BJP) led by Prime Minister Narendra Modi and party president Amit Shah will again be victorious in Gujarat assembly elections. According to the opinion poll done by CSDS for ABP news the BJP is projected to secure a majority by bagging 113-121 seats in Gujarat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి