వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 స్థానాల్లో ‘హస్తం’ నేతలు ‘చే’జేతులా.. విపక్షాలతో కదం కదిపితే..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య సాగిన హోరాహోరీ పోరులో కమలం వికసించినా పలుచోట్ల అతి తక్కువ ఆధిక్యాలతో 'హస్తం' పార్టీ అభ్యర్థులు ఓటమి పాలై ఆ పార్టీ తలరాతను మార్చేశారు. రమారమీ 16 స్థానాల పరిధిలో 200 నుంచి 2000 ఓట్ల మధ్య తేడాతోనే బీజేపీ విజయాలు సాధించింది. అటువంటి స్థానాల్లో హిమ్మత్ నగర్, పోర్ బందర్, విజాపూర్, డియోడర్, డాంగ్స్, మన్సా, గోధ్రా స్థానాల్లో నేతలు తమ రాతలు చేజేతులా మార్చేసుకున్నారనిపిస్తున్నది.

Recommended Video

టార్గెట్‌‌‌కు దూరంగా బిజెపి, కారణమిదే

ఇక శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీ పోటీ చేసిన పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తారుమారు జేసేశాయి. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో స్వతంత్ర్య అభ్యర్థులు భారీగా ఓట్లు పొందగలిగారు. ఇండిపెండెంట్లు పోటీ చేసిన వారిలో పలువురు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేతలే ఓట్లు చీల్చి విజయావకాశాలను దెబ్బతీశారు.

 ఇండిపెండెంట్ అభ్యర్థికి మూడో స్థానం

ఇండిపెండెంట్ అభ్యర్థికి మూడో స్థానం

గిరిజనుల ప్రాభల్యం గల డాంగ్స్‌లో కాంగ్రెస్ పార్టీ కేవలం 768 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఇక మరో ఎస్టీ రిజర్వుడ్ స్థానం కప్రాడాలో కాంగ్రెస్ పార్టీ కేవలం 170 ఓట్లతోనే విజయం సాధించడం గమనార్హం. అయితే గోధ్రాతోపాటు కనీసం ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు 2000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గోధ్రాలో ‘నోటా'పై 3050 ఓట్లు పడితే, గెలుపొందిన బీజేపీ అభ్యర్థి సీకే రౌజ్లీ ఆధిక్యం కేవలం 258 ఓట్లు మాత్రమే. ఇదే స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి 18 వేల ఓట్లు పొంది మూడో స్థానంలో ఉండటం విశేషం.

 ఫతేపురాలో ఎన్సీపీకి 2,747 ఓట్లు.. బీజేపీ ఆధిక్యానికంటే ఎక్కువే

ఫతేపురాలో ఎన్సీపీకి 2,747 ఓట్లు.. బీజేపీ ఆధిక్యానికంటే ఎక్కువే

ఢోక్లా స్థానంలో కాంగ్రెస్ పార్టీ 327 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. బీఎస్పీకి 3139, ఎన్సీపీకి 1198 ఓట్లు వచ్చాయి. అలాగే ఫతేపురా సీట్లు బీజేపీ కేవలం 2,711 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో ఎన్సీపీకి 2747 ఓట్లు పోలయ్యాయి మరి. ఇక బోతాడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కేవలం 906 ఓట్లు తేడాతో ఓటమిని చవిచూసింది. కానీ బీఎస్పీకి 966 ఓట్లు, ముగ్గురు ఇండిపెండెంట్లకు కలిపి 7500 ఓట్లు రావడం ఆసక్తికర పరిణామం. బీజేపీ కూడా పలు అసెంబ్లీ స్థానాల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. కప్రదాతోపాటు మన్సా సీటులో 524, డియోడర్ స్థానంలో 972 ఓట్ల తేడాతో బీజేపీ పరాజయానికి గురైంది.

 మెహ్సానాలో ఇలా బయటపడ్డ నితిన్ పటేల్

మెహ్సానాలో ఇలా బయటపడ్డ నితిన్ పటేల్

పది వేల లోపు ఓట్ల తేడాతో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఓటమి భారాన్ని ఎదుర్కొన్నారు. గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ అందులో మొదటి వారు. బీజేపీ తరఫున మెహ్సానా స్థానం నుంచి పోటీ చేసిన నితిన్ పటేల్ తన సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి జివాభాయి పటేల్‌పై 7,137 ఓట్ల తేడాతో గెలుపొందారు. నితిన్ పటేల్‌కు 90,235 ఓట్లు, జివాభాయి పటేల్‌కు 83,098 ఓట్లు లభించాయి.
గమ్మత్తేమిటంటే ‘పాటిదార్ల రిజర్వేషన్ల' ఆందోళనకు కేంద్రబిందువు మెహ్సానా కావడం గమనార్హం.

 తొమ్మిది వేల తేడాతో ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తిసింగ్ గోహిల్ ఓటమి

తొమ్మిది వేల తేడాతో ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తిసింగ్ గోహిల్ ఓటమి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు శక్తిసింగ్ గోహిల్, తుషార్ చౌదరి కూడా త్రుటిలో ఓటమి పాలయ్యారు. కచ్ జిల్లా మాండ్వి సీటు నుంచి 9,046 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి వీరేంద్ర సిన్హ్ జడేజా చేతిలో ఓటమి పాలయ్యారు. గోహిల్ ఏఐసీసీ అధికార ప్రతినిధుల్లో ఒకరు. శక్తిసిన్హ్ గోహిల్ కేవలం 70, 423 ఓట్లు పొందితే.. విజేత జడేజా 79,469 ఓట్లు పొందారు. కేంద్రంలోని గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన తుషార్ చౌదరి కూడా కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో ఓటమి భారాన్ని మోయక తప్పలేదు. మాజీ సీఎం అమర్సింగ్ చౌదరి తనయుడు తుషార్ చౌదరి.. సూరత్ జిల్లా మాహువా సీటు నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మోహన్ భాయి దోడియా చేతిలో ఓడిపోయారు. మోహన్ భాయి దోడియాకు 76,174 ఓట్లు రాగా, తుషార్ చౌదరి 82,607 ఓట్లు సాధించారు.

 పోర్‌బందర్‌లో కాంగ్రెస్ ఓటమి కేవలం 1855 ఓట్ల తేడాతోనే

పోర్‌బందర్‌లో కాంగ్రెస్ ఓటమి కేవలం 1855 ఓట్ల తేడాతోనే

హోరాహోరీ పోటీలో 61 స్థానాల నుంచి 77 స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్ ముందు గట్టి సవాళ్లే ఉన్నాయి. విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు అందిస్తామన్న విశ్వాసం లేనందు వల్లే ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి కనీసం 13 స్థానాల్లో ఎన్సీపీ, బీఎస్పీ పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అతి తక్కువ మెజారిటీతో ఓటమి పొందారు. పోర్‌బందర్‌లో కాంగ్రెస్ వెటరన్ నేత అర్జున్ మొధ్వాడియాకు కేవలం 1855 ఓట్లతో ‘గెలుపు వాకిట' తలుపులు మూతపడ్డాయి. ఈ స్థానంలో బీఎస్పీ 4,337 ఓట్లు పొందగలిగింది మరి. ఇదే పరిస్థితి బోథాడ్, ఛోటా ఉదయిపూర్, ధోల్కా, ఫతేపురా, మొడాసా, ప్రతింజ్, రాజ్ కోట్ రూరల్, ఉమ్రేథ్, వాంకనీర్ స్థానాల్లో నెలకొంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ స్పందిస్తూ తమ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని వ్యాఖ్యానించారు.

 విపక్షాలను కలుపుకుంటే మెరుగైన ఫలితాలని హితవు

విపక్షాలను కలుపుకుంటే మెరుగైన ఫలితాలని హితవు

కేవలం అధికార బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతోనే ప్రజా విశ్వాసం పొందలేరని, విపక్షాలను కూడగట్టుకుని ఐక్యంగా ముందుకు సాగాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సూచించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశం ఇదేనన్నారు. డీఎంకే నేత తిరుచి శివ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు వంటి ఆమోదయోగ్యం గానీ పనులు చేయడం వల్ల బీజేపీ ప్రజలకు దూరమైందని, ఈ పరిస్థితుల్లో విపక్షాలు ఐక్యంగా సర్కార్ ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. విపక్షాలు కలిసి ముందుకు సాగితేనే అధికార పక్షాన్ని ఓడించగలమని స్పష్టం చేశారు.

నితీశ్ ఇలా జెండా ఎత్తేసి బీజేపీతో జత కట్టారు

నితీశ్ ఇలా జెండా ఎత్తేసి బీజేపీతో జత కట్టారు

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గుర్తుకు వస్తున్నది. మార్చిలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశాయి. అయితే నాటి సమాజ్ వాదీ పార్టీలో తండ్రీ కొడుకులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ గ్రూపులుగా విడిపోయారు. ఇరు గ్రూపులు ఎన్నికల వేళ కలిసిపోయినా.. పరస్పరం ఓటమికి పని చేశాయా? అన్న సందేహాలు ఉన్నాయి. మరోవైపు మాయావతి సారథ్యంలోని బీఎస్పీ విడిగా పోటీ చేసింది. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ, ఎన్సీపీ కూడా విడివిడిగానే బరిలోకి దిగాయి. అందువల్ల మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు గణనీయంగా చీలిపోయింది. ఫలితంగా అనూహ్యంగా బీజేపీ గెలుపొందింది. అప్పుడు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఒక మాట చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించడం కష్ట సాధ్యం అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ హవాను ఎదుర్కునే అంశం మరిచిపోవాలన్నారు. 2019 ఎన్నికలకూ ఇది వర్తిస్తుందన్నారు. అప్పట్లోనే బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేయాలని చరిత్రకారుడు రామచంద్ర గుహా.. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి సూచించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ‘మహా కూటమి' జెండా ఎత్తేసి.. నితీశ్ కుమార్ బీజేపీతో కలిసి పోయారు. కానీ రాహుల్ క్రమంగా శక్తులు కూడదీసుకుని.. మోదీ సర్కార్ విధానాలపై ప్రశ్నలు సంధిస్తూ ముందుకు సాగారు. అయితే విపక్షాలను కలుపుకుని వెళ్లి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
The Gujarat election results declared on Monday revealed a tight contest in assembly seats such as Himatnagar, Porbandar, Vijapur, Deodar, Dangs, Mansa and Godhra. The BJP and Congress were locked in a nail-biting contest in at least 16 seats in Gujarat, where the victory margin was less than 2,000 votes and of just about 200 votes in a few.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X