దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

తప్పంతా కాంగ్రెస్ పార్టీదే అంతా! పొత్తుపై అన్ని ఆపద మొక్కులే.. చాలా నెమ్మదిగా..

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో అధికార పార్టీ బొటాబొటీ స్థానాలతో గెలుపొందడం జాతీయ స్థాయిలో విపక్ష రాజకీయాల పునరేకీకరణకు మార్గం సుగమమైందని హెచ్చరికలు వెలువడ్డాయి. విస్త్రుత స్థాయిలో సామాజిక, రాజకీయ సమీకరణాలతో కూడిన కూటమితోనే ప్రధాని మోదీ - పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సారథ్యంలోని బీజేపీని ఎదుర్కోగలమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

   యువత కాంగ్రెస్ కు పట్టం కట్టిందా ?

   ఎన్నికల్లో అధికారం చేపట్ట లేకపోయినా గుజరాత్‌లో ఆయా మూడు విస్పష్ట సామాజిక వర్గాల పునాదిని మరింత బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జాతీయ సంకీర్ణ రాజకీయాల యుగంలో విభిన్న సామాజిక వర్గాల మధ్య ఐక్యత అమూల్యమైందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

    ఏడాదిన్నర ముందే కాంగ్రెస్ కూటమి కట్టి ఉంటే బెస్ట్ రిజల్ట్స్

   ఏడాదిన్నర ముందే కాంగ్రెస్ కూటమి కట్టి ఉంటే బెస్ట్ రిజల్ట్స్

   పాటిదార్ నేత హార్దిక్ పటేల్, ఓబీసీ నాయకుడు కమ్ ఎమ్మెల్యే అల్పేశ్ ఠాకూర్, మరో ఎమ్మెల్యే - దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ మేవానీ సంయుక్తంగా బీజేపీని మట్టికరిపించేందుకు తీవ్రంగా క్రుషి చేశారు. కొందరు ఈ ముగ్గురు నేతలను యంగ్ టర్క్‌లు అని పిలుస్తున్నారు. 2016 ఆగస్టులో ముగ్గురు యంగ్ టర్కులు తొలిసారి సమావేశమయ్యారు. 2016 భూసేకరణ, పునరావాస చట్టం (గుజరాత్ సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా వీరు ఒక దగ్గరకు చేరారు. 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రూపొందించిన భూసేకరణ చట్టం - 2013 పక్కకు తప్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన చట్టం. ప్రత్యేకించి సదరు భూసేకరణ వల్ల సామాజిక వర్గాలపై మార్పు మదింపు, నిర్వాసితుల అభిప్రాయాలు సేకరించాలన్న నిబంధనలకు తిలోదకాలివ్వడానికే ఈ సవరణలు ప్రతిపాదించింది గుజరాత్ ప్రభుత్వం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో ఈ ముగ్గురు నేతలతో సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకుని ఉంటే.. ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర ముందే కూటమి ఏర్పాటు చేసుకుని ఉండి ఉంటే మెరుగైన ఫలితాలు లభించి ఉండేవి. కానీ ఆచరణలో ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ చాలా నెమ్మదిగా ప్రతస్పందించింది.

    ఎస్సీ, ఎస్టీల ఓట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది

   ఎస్సీ, ఎస్టీల ఓట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది

   జిగ్నేశ్ మేవానీ, హార్దిక్ పటేల్ ముందే తాము బీజేపీకి వ్యతిరేకమని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని తేల్చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా ఎస్సీల ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడతాయని సీఎస్డీఎస్ సర్వే నిర్ధారించింది అదీ కూడా 2012 ఎన్నికల ఫలితాల ఆధారంగానే సుమా. కానీ కాంగ్రెస్ పార్టీకి లభించిన ఎస్సీ ఓట్లలో పది శాతం తగ్గుముఖం పట్టింది. అలాగే గిరిజనుల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్నదన్న సంకేతాలను ఎగ్జిట్ పోల్స్ ఫలితాలిచ్చాయి. ఎస్టీలు 15 శాతం, పటేల్ కేవలం 12 శాతమే సుమా. బహుళ రూపాల్లో ఆదివాసీల్లో గల ప్రభుత్వ వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని ఉంటే ఫలితాలు మరింత గణనీయంగా ఉండి ఉండేవి. పలు ఆదివాసీ గ్రామాలకు ఇప్పటికీ సురక్షిత తాగునీరు అందడం లేదు. పలు రిజర్వాయర్లు, కాలువల నిర్మాణానికి గిరిజనులు తమ భూములు వదులుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో నెలకొంది. 2006 అటవీ హక్కుల చట్టం కింద ఆదివాసీల భూమి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది.

    మానవీయ కోణంలో సంస్కరణలు అమలు చేయాలి

   మానవీయ కోణంలో సంస్కరణలు అమలు చేయాలి

   ఒకవేళ బీజేపీని గట్టిగా ఢీకొట్టాలని తలపోస్తే కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు ఆయా గిరిజనుల ఇండ్లకు వెళ్లి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలి. విస్త్రుత స్థాయిలో సామాజిక రాజకీయ కూటమి ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించాయి. గుజరాత్ రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వాల పట్ల గ్రామీణుల్లో వ్యతిరేకత, వారి ఆర్థిక సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించాల్సింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రాంతీయ నాయకత్వం, క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుజరాత్ రాష్ట్రంలో పలు రకాల ప్రాంతీయ కూటములను ఏర్పాటు చేసేందుకు పూనుకోవాలి. మానవీయ కోణంలో సంస్కరణల అమలు నినాదానికి బదులు భారత పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక అభివ్రుద్ధి వ్యూహాల అమలు కోసం ఉమ్మడిగా ముందుకు సాగాల్సి ఉంది.

    84.7 శాతం మంది కార్మికుల జీవనం అసంఘటిత రంగంలోనే..

   84.7 శాతం మంది కార్మికుల జీవనం అసంఘటిత రంగంలోనే..

   అత్యంత ముఖ్యమైన అంశమేమిటంటే ఆర్థికాభివ్రుద్ధి వ్యూహం అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి కల్పించి, వారిని బలోపేతం చేసేలా ఉండాలి. దేశ జనాభాలో 84.7 శాతం మంది అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 69 శాతం అసంఘటిత రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. తోలు పరిశ్రమ, టెక్స్ టైల్, ఉత్పత్తి, ఇతర చిన్నత తరహా పరిశ్రమల్లోనే అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువగా పని చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 88 శాతం మంది ఉత్పాదక రంగ కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. దేశీయ పరిస్థితులకు అనుగుణంగా అర్ధవంతమైన ఉత్పాదక విధానాన్ని అభివ్రుద్ధి చేసి, ఈ రంగంలో పని ప్రదేశాల వద్ద పరిస్థితులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

    గుజరాతీల్లో తీవ్రంగా గూడుకట్టుకున్న అసమ్మతి

   గుజరాతీల్లో తీవ్రంగా గూడుకట్టుకున్న అసమ్మతి

   అన్ని రంగాల్లో మెరుగైన ఆర్థిక ఫలితాలు రాబట్టేందుకు సమగ్ర ఆర్థికాభివ్రుద్ధిపై ద్రుష్టి సారించాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో ప్రత్యేకించి వ్యవసాయం, డెయిరీ, మత్స్యశాఖ, ఆటవీ రంగాల్లో జీవనం సాగిస్తున్న లక్షల కుటుంబాలు, కోట్ల మంది జీవనాన్ని మెరుగు పరిచే విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంధన రంగంలో అవసరమైన మేరకు సహకార రంగాన్ని అభివ్రుద్ధి చేయాల్సి ఉంది. 18 - 25 ఏళ్లలోపు యువతపై ప్రత్యేకించి ద్రుష్టి సారించాలి. వీరంతా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓటేశారు. 44 శాతం మంది బీజేపీకి ఓటేశారు. అదే పనిగా ప్రచారంచేస్తున్న అభివ్రుద్ధి నినాదానికి వ్యతిరేకంగా గుజరాతీల్లో అసమ్మతి గూడుకట్టుకున్నది. దీనికి కారణం సదరు ప్రవచిత అభివ్రుద్ధి ఫలాలు వారి దరి చేరనే లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్ష పార్టీలు భారతదేశంలోని లక్షల మంది నిరుద్యోగ యువతకు అర్ధవంతమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని, ‘వైబ్రంట్' డెమొక్రసీ ప్రధాన ఏజెండాగా అందరికీ ఆర్థిక లాభాల పంపిణీ దిశగా మార్పు జరుగాల్సి ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

   English summary
   Gujarat has witnessed a keenly fought election that portends well for the revival of political contests at the national level. The Congress sought to reinforce its base by uniting three distinct electoral constituencies, though these efforts did not yield the expected electoral dividends. A fuller understanding of these results is invaluable for building socially diverse and politically salient electoral coalitions in national politics.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more