వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్ అవుతుందా?: 'గుజరాత్‌లో బీజేపీకి 150 సీట్లు ఖాయం'

గుజరాత్ శాసన సభ ఎన్నికలు మొదటి దశలో మొత్తం 182 సీట్లకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. దాదాపు అన్ని సర్వేలు కూడా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికలు మొదటి దశలో మొత్తం 182 సీట్లకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. దాదాపు అన్ని సర్వేలు కూడా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి.

రిజర్వేషన్ల కోసం తమను బీసీల్లో చేర్చాలంటూ పటేళ్లు 2015లో ఆందోళన ప్రారంభించారు. దానికి హార్దిక్ పటేల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోసారి బీజేపీకి విజయం నల్లేరు మీద నడక కాదని అంటున్నారు.

Recommended Video

Gujarat Assembly Eections: Amit Shah Kicks Off Door-To-Door Campaign

నిన్న 47 మందికి, మరి నేడు: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతవాళ్లకు మోడీ షాక్?నిన్న 47 మందికి, మరి నేడు: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతవాళ్లకు మోడీ షాక్?

పటేళ్లు కాంగ్రెస్‌కు మద్దతిస్తే బీసీలు ఆదుకుంటారా?

పటేళ్లు కాంగ్రెస్‌కు మద్దతిస్తే బీసీలు ఆదుకుంటారా?

పటేళ్లు కనుక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే బీసీ జాబితాలో ఉన్న క్షత్రియులు, దాదాపు ఇరవై శాతానికి బైగా ఉన్న కోలీల ఓట్లు అవసరమవుతాయి. క్షత్రియులు, పటీదార్లు ఎన్నికల్లో ఒకే పార్టీకి మద్దతు ఇవ్వరు. బీసీ నేత అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్‌కు మద్దతు పలకడం గమనార్హం. పటేళ్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే క్షత్రియులు బీజేపీ వైపు వస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి.

వారు బీజేపీ వైపే మొగ్గు

వారు బీజేపీ వైపే మొగ్గు

పటీదార్లలో కోటా ఆశించే కొద్దిమంది మధ్య తరగతి వారే తమకు దూరమయ్యారని బీజేపీ భావిస్తోంది. రాహుల్ ప్రచారంలో ఆలయాల్లో పూజలు చేస్తూ ఉండటం గమనార్హం. పైగా పటేళ్లకు కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో ముస్లీంలలో మరింత మార్పు వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లో ఎస్సీల కంటే ఎస్టీలు ఎక్కువ. వారు బీజేపీ వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు.

బీజేపీకి వారి మద్దతు

బీజేపీకి వారి మద్దతు

గుజరాత్‌ను ప్రాంతాల వారీగా చూస్తే కచ్, ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉంది. సగం సీట్లు ఇక్కడే ఉన్నాయి. బీజేపీకి కంచుకోటగా భావించే మధ్య, దక్షిణ గుజరాత్‌లలో బీజేపీ చాలా ముందు ఉంది. జనం కూడా బీజేపీకే మద్దతిస్తున్నారని సర్వేల్లో తేలింది.

150 సీట్లు కచ్చితంగా గెలుస్తాం

150 సీట్లు కచ్చితంగా గెలుస్తాం

కాగా, గుజరాత్‌లో గెలుపుపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ధీమాతో ఉన్నారు. తాము 150 సీట్లు గెలుస్తామని ఆయన చెబుతున్నారు. ఎలాంటి అనుమానం లేదని, విజయ్ రుపాణీ, నితిన్ నితిన్ పటేల్‌ల ఆధ్వర్యంలో బీజేపీ గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే తమ నేత ఎవరో చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. 2002 నుంచి కాంగ్రెస్ అదే చెబుతూ వస్తోందని, 2022లోను అదే చెబుతుందని ఎద్దేవా చేశారు.

English summary
Ahead of the BJP's parliamentary board meeting, BJP president Amit Shah on Tuesday hinted that the Gujarat elections will be fought under Vijay Rupani, even as he dared the Congress to name a face for its campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X