పాటిదార్లు లేకపోతేనేం.. ఆదివాసులున్నారుగా.. గుజరాత్ ఎన్నికల్లో కమలనాథుల ఫోకస్
ఒకరు పోతే మరొకరు ఉన్నారుగా అన్నట్లుగా ఉన్నది కమలనాథుల వ్యవహారం. ఇప్పటికే ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కోసం సాగిన ఆందోళన పాటిదార్లను బీజేపీకి దూరం చేసింది. ఓబీసీలూ దూరమయ్యారు.
గాంధీనగర్: ఒకరు పోతే మరొకరు ఉన్నారుగా అన్నట్లుగా ఉన్నది కమలనాథుల వ్యవహారం. ఇప్పటికే ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కోసం సాగిన ఆందోళన పాటిదార్లను బీజేపీకి దూరం చేసింది. ఓబీసీలూ దూరమయ్యారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా బీజేపీకి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఓబీసీలు, పాటిదార్లు, దళితులు కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన నేపథ్యంలో కమలనాథులు, బీజేపీ అధి నాయకత్వం 'ఆదివాసీ'ల ఓట్లపై ద్రుష్టి సారించింది.
గుజరాత్ రాష్ట్రంలోని దంగ్ జిల్లా గిరిజనుల ఆధిపత్య జిల్లా. రాష్ట్రంలోని ప్రధాన రహదారి ఒక్కటైన అహ్వాకు కిలోమీటర్ దూరంలోనే దంగ్ జిల్లా కేంద్రం ఉంది.
దేశంలోని నిరుపేద సామాజిక వర్గాల వారైన 'ఆదివాసీ'లకు లబ్ది చేకూర్చేందుకు విద్యా, ఆరోగ్య రంగంలో వసతులు, ఆశ్రమం ఉన్నాయి. ఈ ఆశ్రమంలో 50 మంది గిరిజన విద్యార్థులకు రెసిడెన్షియల్ వసతి ఉంది. ఈ హాస్టల్‌లో ఏటా రూ.1000 సాధారణ ఫీజు చెల్లిస్తే బస చేసేందుకు వెసులుబాటు ఉంది. స్థానిక దంగ్ జిల్లాలోని గ్రామాల ప్రజలు టెక్నిక్‌లు తెలుసుకునేందుకు ఈ సంస్థలో శిక్షణ పొందారు. తల్లిదండ్రులకు పౌష్టికాహార విలువల గురించి అవగాహన కల్పించేందుకు మహిళా స్వయం సహాయక గ్రూపులు పని చేస్తున్నాయి.

కాంగ్రెస్ కంచుకోటలో పునాది పెంచుకునేందుకు బీజేపీ ఇలా
2006 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు చెందిన వనవాసీ కల్యాణ్ ఆశ్రమం (వీకేఏ) ఆధ్వర్యంలో ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరొందిన గండ్ జిల్లాలో బీజేపీ, దాని అనుబంధ సంస్థల పునాదిని పెంపొందించుకునేందుకు ఈ ఆశ్రమంలో విద్యార్థులకు శిక్షణ గరుపుతోంది. దంగ్ జిల్లాలో రెండు లక్షల మంది గిరిజనులు జీవిస్తున్నారు. వారిలో భీళ్లు, కొకానీలు, వర్లీలు ఉన్నారు. వీరంతా సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కాని కొందరు నేతలు అసంత్రుప్తిగా వ్యవహరిస్తున్నారు.

ఉజ్వల పథకంతో ఆదివాసుల్లో ఇలా మార్పు
రాష్ట్ర జనాభాలో ఆదివాసీలు, గిరిజనులు 15 శాతం మంది ఉంటారు. 182 అసెంబ్లీ స్థానాల పరిధిలో 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయా పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను ఖచ్చితంగా నిర్దేశిస్తారు. ఈ నేపథ్యంలో ఓబీసీలు, పాటిదార్ల అసంతృప్తిని అధిగమించేందుకు ఆదివాసీల మద్దతు పొందాలని కమలనాథులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. లోక్ నీతి, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) వాదన ప్రకారం సంప్రదాయ కాంగ్రెస్ మద్దతు దారులైన గిరిజనులు కమల పక్షం వైపు చేరిపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసే ‘ఉజ్వల' వంటి ప్రజాదరణ గల పథకాలతో గిరిజనులు లబ్ది పొందుతున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ తమను పూర్తిగా తమ అవసరాలకు వాడుకుని వదిలేశాయని గిరిజనులు భావిస్తున్నారని గుజరాత్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం అధిపతి డాక్టర్ జేసీ పటేల్ తెలిపారు. అయితే గిర్ అటవీ ప్రాంతంలోని కొన్ని సామాజిక వర్గాల వారికి ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయడంపై పలు ఆదివాసీ గ్రూపులు అసంత్రుప్తికి గురవుతున్నారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కల్పించిన హక్కులతోపాటు ఆదివాసీల డిమాండ్లను నెరవేర్చిన వారికి మాత్రమే గిరిజనులు ఈ దఫా ఓటు వేయాలని భావిస్తున్నారని చెప్పారు.

గుజరాతీలను వెంటాడుతున్న ఆరోగ్య కేంద్రాల కొరత
స్వచ్ఛ భారత్ మిషన్ పథకం అమలు చేస్తామని ప్రకటించిన తర్వాత దంగ్ జిల్లాలోని బార్ఖెట్ గ్రామంలో పలువురికి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు లభించాయి. కానీ గ్రామస్తులు నీటి సమస్యతతో కొట్టుమిట్టాడుతున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో పేద ప్రజలంతా వ్యవసాయం వదిలేసి అతి తక్కువ వేతనాలకు పని చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతున్నది. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ గుజరాతీ పుత్రుడినన్న భావోద్వేగంతో ప్రజలకు మరోసారి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ముల్చుంద్‌లో నీటి కొరత, పేలవంగా నడుస్తున్న ఆరోగ్య కేంద్రాలు, పలు రంగాల్లో వసతుల లేమి వెంటాడుతున్నది. తాము ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని అంటున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా ఒరిగేదేమీ లేదని దేవ్రాం భాయి అనే రైతు చెప్తున్నాడు.

అమర్సింగ్ చౌదరి హయాంలో ఇలా గుర్తింపు
గిరిజన హక్కుల కార్యకర్తలు మాత్రం తమ సామాజిక వర్గం నిర్లక్ష్యానికి గురి కావడానికి ఇరు పార్టీలు సమాన బాధ్యత వహించాలని అభిప్రాయ పడుతున్నారు. అటవీ భూముల సాగు అన్నది కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నదని జన్ సంఘర్ష్ మంచ్ అనే పౌర హక్కుల సంస్థ కన్వీనర్ ఎస్హెచ్ అయ్యర్ తెలిపారు. సరైన ఉద్యోగాల కల్పన ఊసే లేదన్నారు. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ గిరిజనులు ప్రధానం కాలేదని, ఈ దఫా మాత్రం కుల ప్రాతిపదికన ఓట్ల చీలిక జరుగుతున్నదని తెలిపారు. అధికార బీజేపీ పట్టించుకోకున్నా.. విపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకుంటుందని భావించామని, కానీ వారి సమస్యల పరిష్కారంలో విఫలమైందని ఆదివాసీ కిసాన్ సంఘర్ష్ మోర్చా నాయకుడు రోమెల్ సుతారియా వ్యాఖ్యానించారు. గిరిజనుల హక్కులకు ప్రత్యామ్నాయ వేదిక అవసరం ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ చౌదరి సీఎంగా ఉన్నప్పుడు 1985 - 89 మధ్య కాలంలో గుజరాత్ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చారు. ఆయన తనయుడు తుషార్ చౌదరి కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగారు.

గిరిజనుల ప్రాంతాల్లో సంఘ్ అనుబంధ సంస్థల కార్యక్రమాలు
ఇక యంగ్ టర్కులుగా పేరొందిన దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ మేవానీ. ఓబీసీల నేత అల్పేశ్ ఠాకూర్, పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ వంటి వారు కూడా గిరిజన సామాజిక వర్గాలను ఆకట్టుకోలేకపోయారు. జేడీయూ నేత చోటుభాయి వాసవ వంటి గిరిజన నేతలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పట్టుకలిగి ఉన్నారు. అటవీ హక్కుల చట్టం అమలులో గిరిజనులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాపీ ప్రాంతంలో స్టోన్ క్రషింగ్, చట్ట విరుద్ధ ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గిరిజనులు ఆయుధాలు ఎక్కుపెట్టశారు. వారందరినీ అక్కున చేర్చుకునేందుకు ఆరెస్సెస్.. వనవాసీ కల్యాణ్ ఆశ్రమం (వీకేఏ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పని చేపడుతున్నది. వల్సాద్, శబర్ కంట, పంచ్ మహాల్, చోటౌడెపూర్, నర్మద ప్రాంతాల్లో వీకేఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. హిందూత్వ సంస్థలు గిరిజనులను తమలో చేర్చుకునేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications