మహిళకు చికిత్స అందించేందుకు 8 కి.మీ. నడక
తీవ్ర అస్వస్థతకు గురైన బాలింతను కాపాడేందుకు 108 సిబ్బంది దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచివెళ్ళి మరీ చికిత్స చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని బవస్కంత జిల్లాలో చోటుచేసుకొంది.
అహ్మదాబాద్: తీవ్ర అస్వస్థతకు గురైన బాలింతను కాపాడేందుకు 108 సిబ్బంది దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచివెళ్ళి మరీ చికిత్స చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని బవస్కంత జిల్లాలో చోటుచేసుకొంది.
ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల గుజరాత్‌లో కురిసిన వర్షాలకు బనస్కంత జిల్లా పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఈ ప్రాంతంలో 22 ఏళ్ళ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఆమె పొట్టకు వేసిన కుట్ల కారణంగా ఆమె అస్వస్థతకు గురైంది. ఈ విషయం తెలుసుకొన్న 108 సిబ్బంది ఆమెను రక్షించేందుకుగాను బయలుదేరారు. అయితే గ్రామానికి వాహనాలు వచ్చే వీలులేదు. దీంతో వాళ్ళు బనాన్ నదిపై బోటు ద్వారా వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గంలో 8 కిలోమీటర్లు నడిచి బాధితురాలికి చికిత్స అందంచారు.












Click it and Unblock the Notifications