హర్దిక్ పటేల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు: రంగంలోకి జాతీయ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హర్ధిక్ పటేల్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో జాతీయ మహిళా కమిషన్ బాధితురాలిని కలువాలని నిర్ణయం తీసుకొంది.

గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని హర్దిక్ పటేల్ ఓ యువతితో హోటల్‌ గదిలో ఏకాంతంగా ఉన్న సిడి ఇటీవల మీడియాలో ప్రసారమైంది. ఈ సిడిపై హర్దిక్ పటేల్ తీవ్రంగా స్పందించారు.

నాకు పెళ్ళి కాలేదు, నేనేం నపుంసకుడిని కాను: హర్ధిక్ పటేల్ సంచలనం

తనపై బురద చల్లేందుకు బిజెపి మార్పింగ్ వీడియోలో బయటపెట్టిందని హర్దిక్ పటేల్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు తనకు రూ. 2 కోట్లు ఇస్తే గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్పింగ్ సిడిని కూడ తయారు చేస్తానని సవాల్ విసిరారు.

హర్ధిక్ పటేల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

హర్ధిక్ పటేల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్‌పై ఓ యువతి జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. హర్ధిక్ పటేల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాదితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. బాధితురాలిని కలుసుకొనేందుకు స్వయంగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రావాలని నిర్ణయం తీసుకొన్నారు.

బాధితురాలి వద్దకు మహిళా కమిషన్ చైర్మెన్

బాధితురాలి వద్దకు మహిళా కమిషన్ చైర్మెన్

హర్దిక్ పటేల్ పై యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. 24ఏళ్ల హార్థిక్‌ పటేల్‌పై ఫిర్యాదు అందిన క్రమంలో బాధితురాలిని స్వయంగా కలిసేందుకు ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ సూరత్‌ను సందర్శిస్తారని సమాచారం.అయితే మహిళా కమిషన్ చైర్ ‌పర్సన్ సూరత్ సందర్శించిన తర్వాత ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమౌతాయో చూడాలి.

రాజకీయ రంగు

రాజకీయ రంగు

గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో హర్దిక్ పటేల్ సిడి బయటకు రావడంతో రాజకీయ రంగు పులుముకొంది. పటీదార్ల డిమాండ్ల పట్ల కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని హర్దిక్ పటేల్ ప్రకటించారు. అయితే పటీదార్ల డిమాండ్లకు సానుకూలంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి పటీదార్లు మద్దతు ప్రకటించారు.

హర్దిక్ చుట్టూ రాజకీయం

హర్దిక్ చుట్టూ రాజకీయం

గుజరాత్ ఎన్నికల్లో పటీదార్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నారు. అయితే డిమాండ్ల సాధన కోసం కొంతకాలంగా పటీదార్లు ఆందోళన నిర్వహించారు. అయితే ఎన్నికలు జరుగుతున్న సమయంలో హర్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతును ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలోనే పలుమార్లు వివాదాస్పద ఘటనలతో హర్దిక్ పటేల్ వార్తల్లో నిలిచారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman has accused Patidar Anamat Andolan Samiti (PAAS) leader Hardik Patel of sexual exploitation. The woman has complained to the National Commission for Women in this regard.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి