వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ పెళ్లిళ్లు నిలబడవు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ‘పెళ్లైన 2నెలలకే వేధింపులు’

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: అతను లేదా ఆమె.. ఎవరు? ఎలాంటివారు? అతని గురించి పూర్తిగా తెలియకున్నా సోషల్ మీడియా కారణంగా వ్యక్తుల మధ్య పరిచయాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిచయాలు కొంతమంది విషయంలో మేలు చేస్తున్నప్పటికీ.. చాలా మంది విషయంలో కీడే ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం.

కాగా, ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి చేసుకున్న ఓ జంట కోర్టు మెట్లెక్కింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యవహారానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫేస్‌బుక్ వివాహాలు నిలబడవు

ఫేస్‌బుక్ వివాహాలు నిలబడవు

ఫేస్‌బుక్‌ మూలంగా నిశ్చయమైన వివాహాలు నిలబడవని, విచ్ఛిన్నమైపోతాయని గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జెబీ పార్దివాలా అభిప్రాయపడ్డారు. అంతేగా ఆ దంపతులకు విడాకులు తీసుకోవలసిందిగా సూచించారు.

 పెళ్లైన రెండు నెలలకే వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే వేధింపులు

రాజ్‌కోట్‌కు చెందిన ఫాన్సీ షా అనే యువతి తన భర్త జయదీప్‌ షా, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ దాఖలు చేసిన కేసులో హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన రెండునెలలకే వారి వైవాహిక జీవితంలో తీవ్రస్థాయి వివాదాలు తలెత్తిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఎఫ్‌బీ పెళ్లిళ్లు విఫలమే..

ఎఫ్‌బీ పెళ్లిళ్లు విఫలమే..

అయితే, ఇరు కుటుంబాలు ఓ అంగీకారానికి రావడానికి ఏ మాత్రం సుముఖంగా లేని విషయాన్ని న్యాయమూర్తి తెలిపారు. ‘ఫేస్‌బుక్‌ల ద్వారా నిర్ణయమౌతున్న ఆధునిక వివాహాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఈ పెళ్లి విఫలం అవకతప్పదు' అన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు.

3ఏళ్ల ఎఫ్‌బీ పరిచయంతో పెళ్లి.. వేధింపులు

3ఏళ్ల ఎఫ్‌బీ పరిచయంతో పెళ్లి.. వేధింపులు

ఫాన్సీ, జయదీప్‌లిద్దరికీ 2011లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరూ 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండు నెలలైనా అవకుండానే భర్త జయదీప్‌, అత్తమామలు తదితరులు తనను వేధిస్తున్నారంటూ ఫాన్సీ కేసు వేసింది.

English summary
With young people increasingly taking to social media to find new friends and life partners, the Gujarat High Court has advised a couple to dissolve their troubled marriage, saying that a marriage fixed on Facebook is "bound to fail".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X