గుజరాత్ కాంగ్రెస్‌కు షాక్ : పార్టీకి అల్పేశ్ రాజీనామా, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా, కారణమిదేనా ?
ముంబై : సార్వ్రత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు గుజరాత్ ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆయనతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ధావల్‌సిన్ ఠాకూర్, భారత్ జీ ఠాకూర్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌కు షాక్ ..?
అల్పేశ్ 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీని మరింత బలోపేతం చేశారు. అల్పేశ్ కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో తొలివిడత పోలింగ్‌కు కొద్ది గంటల ముందు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చారు.

హైకమాండ్‌పై గుర్రు
గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల అల్పేశ్ అసంతృప్తితో ఉన్నారు. అధికార బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోన్న వేళ .. తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గుజరాత్‌లో ఠాకూరు కులం చాలా బలమైన సామాజిక వర్గం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి నష్టమే కలిగిస్తోంది.

ఇదే కారణమా ?
2017లో బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్‌లో హర్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవాని, అల్వేశ్ ఠాకూర్ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పటన్ లోక్‌సభ స్థానం నుంచి అల్వేశ్ పోటీచేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మాజీ ఎంపీ జగదీశ్ ఠాకూర్ వైపు మొగ్గుచూపింది. అల్వేశ్‌కు మొండిచేయి చూపడంతో .. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై గుర్రుగా ఉన్నారు.

నెలలోనే మారిన స్వరం..
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్న అల్పేశ్ .. పార్టీ వీడుతారని నెలరోజుల ముందునుంచే ఊహాగానాలు వినిపించాయి. దీనిపై మీడియా ఆయను ప్రశ్నించగా .. సున్నితంగా తోసిపుచ్చారు. పార్టీ, తన మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు పొడచూపిన మాట వాస్తవం, కానీ అవి ఇప్పుడు తొలగిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఠాకూర్ల ప్రయోజనా కోసం పాటుపడతానని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications