గ్రాండ్ వెడ్డింగ్ చేసిన గుప్తా సోదరులకు భారీ జరిమానా విధించిన మున్సిపాలిటీ
ఉత్తరాఖండ్ : పెళ్లి పేరుతో ఊరు మొత్తాన్ని చెత్తమయం చేసినందుకు దక్షిణాఫ్రికా వ్యాపారవేత్తలకు భారీ జరిమానా విధించింది జోషిమతీ మున్సిపాలిటీ. దక్షిణాఫ్రికాకు చెందిన అజయ్ మరియు అతుల్ గుప్తా అనే వ్యాపార వేత్తలు తమ కుమారుడి వివాహంను చాలా గ్రాండ్‌గా చేసింది. అయితే వివాహం కోసం వాడిన సామగ్రి అంతా అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో అక్కడి జంతువులు ఆ ప్లాస్టిక్ సామగ్రిని తిని మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుప్తా సోదరులపై రూ.2.5 లక్షలు జరిమానా విధించారు.
రూ.2.5 లక్షల జరిమానాలో లక్ష రూపాయలు బహిరంగ విసర్జన చేసినందుకు మరో రూ.1.5 లక్షలు చెత్తను పడేసినందుకు విధించారు అధికారులు. దీనికి సంబంధించిన చలానా కూడా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి పంపించింది. దీనికి తోడు వివాహం తర్వాత చెత్త చెదారం భారీగా మిగిలిపోవడంతో దాన్ని తీసుకెళ్లేందుకు రూ.8.14 లక్షల బిల్లును కూడా తయారు చేస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీ వద్ద రూ.5.54 లక్షలు గుప్తా సోదరులు డబ్బులు డిపాజిట్ చేశారు.ఇందులో రూ.54వేలు యూజర్ ఛార్జీల కింద చెల్లించింది.

ఈ హైప్రొఫైల్ వివాహం తర్వాత జోషిమత్ మున్సిపాలిటీ దాదాపు 306 క్వింటాళ్ల చెత్తను సేకరించింది మున్సిపాలిటీ. ఈ చెత్తను తరలించేందుకు 3 నుంచి 4 ట్రక్కులు ప్రతిరోజు వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి మొత్తం చెత్తను క్లీన్ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే గుప్తా సోదరులు చమోలీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వద్ద సెక్యూరిటీ కింద డిపాజిట్ చేసిన రూ. 3 కోట్లు రీఫండ్ పై జూలై 8న ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు చెప్పనుంది. హై కోర్టు ఆదేశాల మేరకు ఈ గ్రాండ్ మ్యారేజ్‌ను 13 ప్రభుత్వ శాఖలు దగ్గరుండి వీడియోను తీశాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications