వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం అంగీకరించలేదని భార్య హత్య

|
Google Oneindia TeluguNews

Gurgaon man kills wife for objecting to his affair
జైపూర్/గుర్గావ్: వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని ఓ దుర్మార్గుడు తన భార్యను కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన గుర్గావ్‌లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు దీపక్ ఖురానా(50) తన భార్య అల్కా ఖురానాను లైసెన్స్‌డ్ పిస్టోల్‌తో చంపేశాడు.

వివాహేతర సంబంధాన్ని ఆమె అంగీకరించకపోవడంతో దీపక్.. అల్కాతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన దీపక్.. తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్చి చంపాడు. కాగా, ఈ దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు మలేషియాలో పైలెట్‌గా విధులు నిర్వహిస్తుండగా, కూతురు తన భర్తతో ఢిల్లీలో నివాసముంటోంది.

భార్యతో గొడవపడి బండతో మోది కూతురి హత్య

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే తన కూతురును అత్యంత దారుణంగా బండరాయితో మోది హత్య చేశాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగర్పూర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు లక్ష్మణ్ సింగ్(35) కూలీగా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం లక్ష్మణ్ సింగ్ తన భార్య బబ్లీతో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఆ తర్వాత తన కూతురు హత్తును తీసుకుని బబ్లీ తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. కాగా, మంగళవారం మద్యం సేవించిన లక్ష్మణ్ సింగ్ తన అత్తగారింటికి వెళ్లాడు.

తన భార్యను తనతో రావాలని కోరాడు. అందుకు బబ్లీ నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన లక్ష్మణ్ సింగ్ తన కూతురు హత్తును బలవంతంగా తన వెంట తీసుకెళ్లాడు. రోనాల్పూర్ గ్రామానికి తీసుకెళ్తూ మార్గమధ్యలో ఓ బండరాయితో మోది హత్తును చంపేశాడు.

మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్టు చేశారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పార్థీవదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.

English summary
A 53-year-old businessman on Wednesday shot his wife nine times, killing her on the spot, after she objected to his extramarital affair, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X