రాజస్తాన్‌లో డేరా బాబా దత్తపుత్రిక?: అరెస్టైతే కీలక విషయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

సిర్సా: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ముఖ్య అనుచరురాలు, ఆమె దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ రాజస్థాన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి, ఆస్ట్రేలియా నుంచి ఔషధాలు

ఆమె మొబైల్ ఫోన్ సిగ్నల్స్ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ట్రేస్ అయినట్లుగా తెలుస్తోంది. హనీప్రీత్‌ను అరెస్టు చేస్తే డేరాకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు అంటున్నారు.

Gurmeet Ram Rahim Singh's 'closest premi' Honeypreet Insan in Rajasthan?

గుర్మీత్‌కు శిక్ష పడిన తర్వాత హనీప్రీత్ కనిపించకుండా పోయింది. ఇప్పటికే ఆమెను అరెస్టు చేసేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల కిందడ హనీప్రీత్ ఫోటోలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లోని స్టేషన్లకు పంపించారు.

ఈ నేపథ్యంలో హనీప్రీత్ ఫోన్ రాజస్థాన్‌లో ట్రేస్ అవడం గమనార్హం. గత రాత్రి హనీప్రీత్ డేరా ఉన్నతాధికారికి ఫోన్ చేసిందని, ఆ ఫోన్ వల్లే ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. కాగా, ఇండో - నేపాల్ బార్డర్‌లోని అప్రమత్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Days after the Haryana Police issued a 'lookout notice' against Honeypreet Insan, the mobile phone of Gurmeet Ram Rahim Singh's adopted daughter has been traced to Barmer in Rajasthan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి