• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జ్ఞానవాపి మసీదు కేసు: ‘శివలింగం’కు భద్రత కల్పించండి, ప్రార్థనలను అడ్డుకోవద్దంటూ సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

వారణాసి: జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం ఉన్నట్లు తెలిపిన ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను మంగళవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ముస్లింలు ప్రార్థనలు చేయడానికి మసీదులోకి ప్రవేశాన్ని అడ్డుకోవద్దని పేర్కొంది. మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశించిన స్థానిక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారాలను నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ పిటిషన్‌పై హిందూ పిటిషనర్లకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

మే 19లోగా తమ ప్రతిస్పందనలను దాఖలు చేయాలని కోర్టు వారిని కోరింది. అయితే జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన వ్యాజ్యాన్ని విచారిస్తున్న వారణాసి సివిల్ జడ్జి ముందు తదుపరి విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Gyanvapi Mosque Case: Secure Shivling Area But Allow Namaz Inside Masjid: Supreme Court.

"శివలింగం ఉన్నట్లు నివేదించబడిన ప్రాంతాన్ని రక్షించే దిశలో ముస్లింలు మసీదులోకి ప్రవేశించడం లేదా ప్రార్థనలు, మతపరమైన ఆచారాల కోసం ఉపయోగించడాన్ని ఏ విధంగానూ నిరోధించకూడదు లేదా అడ్డుకోకూడదు" అని సుప్రీం కోర్టు పేర్కొంది.

గత వారం, జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వేపై మధ్యంతర స్థితిని ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

సోమవారం జ్ఞానవాపి మసీదు సముదాయంలో వీడియోగ్రఫీ సర్వే పూర్తయింది. హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు 'వజూఖానా'(ముస్లిం భక్తులు నమాజ్ చేసే ముందు ఆచారాలు నిర్వహించడానికి ఉపయోగించే చిన్న రిజర్వాయర్)కు సమీపంలో శివలింగం కనిపించిందని పేర్కొన్నారు.

నివేదిక ఇవ్వాలంటూ వారణాసి కోర్టు ఆదేశం

జ్ఞాన్‌వాపి మసీదు సముదాయ ప్రాంగణాన్ని సర్వే చేసేందుకు వారణాసి కోర్టు నియమించిన బృందానికి తన నివేదికను కోర్టు ముందు సమర్పించేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసును విచారిస్తున్న వారణాసిలోని సివిల్ కోర్టు తాను నియమించిన ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రాను తొలగించింది. మిశ్రా సహాయకుడు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేసినట్లు సమాచారం.

మిగిలిన ఇద్దరు - విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ - వరుసగా కోర్టు కమిషనర్, డిప్యూటీ కోర్టు కమిషనర్‌గా కొనసాగుతారు. కాగా, కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సుదీర్ఘ న్యాయ పోరాటంలో చిక్కుకుంది. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మిస్తున్నారనే వాదనలు రావడంతో వారణాసిలోని న్యాయస్థానం మసీదు నిర్మాణంపై విచారణ జరపాలని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)ని ఆదేశించింది.

మసీదులో శివలింగం: వారణాసి కోర్టు కీలక ఆదేశాలు

జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం వద్ద చివరి రోజు సర్వే సందర్భంగా 'శివలింగం' కనిపించిందని, ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు సోమవారం జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఆ ప్రాంతానికి ఎవరినీ ప్రవేశించేందుకు అనుమతివ్వద్దని స్పష్టం చేసింది.

"సీల్డ్ ఏరియా భద్రతకు డీఎం, పోలీస్ కమీషనర్, పోలీస్ కమిషనరేట్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ వారణాసి బాధ్యత వహిస్తారు" అని ఆదేశించింది. ఈ కేసులో హిందూ పిటిషనర్ అయిన సోహన్ లాల్ ఆర్య, సర్వే కమిటీ కాంప్లెక్స్ వద్ద శివలింగాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు

మసీదు సర్వే కోసం కోర్టు కమీషన్‌తో పాటు వచ్చిన ఆర్య, తమకు "నిశ్చయాత్మకమైన ఆధారాలు" దొరికాయని చెప్పారు లాల్ ఆర్య. "శివలింగం కనిపించిందని... ఎవరి కోసమైతే నంది ఇప్పటి వరకు ఎదురుచూస్తున్నాడో ఆయన దర్శనమిచ్చాడని తెలిపారు. విషయాలు స్పష్టంగా తెలియగానే మసీదు ప్రాంగణంలో 'హర్ హర్ మహావ్ దేవ్' కీర్తనలు ప్రతిధ్వనించాయి," అని ఆయన వెల్లడించారు.

శివుడి లింగం గుర్తించిన ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయకుండా చూసుకోవాలని వారణాసి కోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్పష్టం చేసింది. డీఎం, పోలీస్ కమిషనర్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) కమాండెంట్ వారణాసి.. సీల్ చేసిన ప్రాంత భద్రతకు బాధ్యత వహించాలన్నారు.

English summary
Gyanvapi Mosque Case: Secure Shivling Area But Allow Namaz Inside Masjid: Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X