కోడలు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాజీ ప్రధాని, అక్కడ కాదు, ఎక్కడంటే ? !
బెంగళూరు/మైసూర్/హాసన్: మాజీ ప్రధాని, జేడీఎస్ దళపతి హెచ్ డీ. దేవేగౌడ కొడుకులు ఇద్దరిని పిలిపించి రాజీ చర్చలు జరిపారు. శుక్రవారం మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి, మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ బెంగళూరులోని మాజీ ప్రధాని, తండ్రి హెచ్.డీ. దేవేగౌడ ఇంటికి వెళ్లారు. తండ్రి హెచ్.డీ. దేవేగౌడ చెప్పిన రాజీ సూత్రానికి హెచ్ డీ. కుమారస్వామి, హెచ్ డీ. రేవణ్ణ సరే అన్నారని తెలిసింది.
మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కోడలు భవానీ రేవణ్ణ హాసన్ పట్టణ నియోజక వర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత పార్టీ జేడీఎస్ నా భార్య భవానీకి సీటు ఇవ్వకపోతే ఆమె స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుందని, అందులో ఎలాంటి రాజీ లేదని ఆమె భర్త హెచ్.డీ. రేవణ్ణ తేల్చి చెప్పారు.

హాసన్ టిక్కెట్ తాను జేడీఎస్ కార్యకర్తకు ఇస్తానని కుమారస్వామి మొండిపట్టుపట్టారు. ఇదే విషయంలో మాజీ ప్రధాని హెచ్ డీ, దేవేగౌడ ఫ్యామిలీలో ఫైటింగ్ మొదలైయ్యింది. అయితే ఇప్పుడు మైసూరు జిల్లాలోని చామరాజ నియోజక వర్గం నుంచి భవాని రేవణ్ణ పోటీ చెయ్యడానికి మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
హాసన్ లో భవాని రేవణ్ణ ఓడిపోతారని దళపతి చేయించిన సర్వేలో వెలుగు చూసిందని. అందకే చామరాజ నియోజక వర్గం నుంచి ఆమెను పోటీ చేయించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలిసింది. చామరాజ నియోజక వర్గంలో భవాని రేవణ్ణ కచ్చితంగా విజయం సాధించి ఎమ్మెల్యే అవుతారని జేడీఎస్ నిర్వహించిన సీక్రేట్ సర్వేలో వెలుగు చూసిందని తెలిసింది.

అయితే హాసన్ నియోజక వర్గం నుంచి తాను పొటీ చేస్తానని పట్టుబట్టిన భవాని రేవణ్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలని జేడీఎస్ నాయకులు అంటున్నారు. చామరాజ నియోజక వర్గంలో జేడీఎస్ కు మంచిపట్టు ఉంది. చామరాజ నియోజక వర్గంలో 1, 13, 829 మంది మహిళా ఓటర్లు ఉన్నారని ,ఇంత వరకు ఇక్కడ ఏ మహిళ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యలేదని. భవాని రేవణ్ణ పోటీ చేస్తే కచ్చితంగా ఆమె విజయం సాధిస్తారని స్థానిక జేడీఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications