బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగులతో భేటీకి అనుమతివ్వం: రాహుల్‌ గాంధీకి హెచ్ఏఎల్ షాక్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉద్యోగులతో సమావేశం కావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ సంస్థ ఆవరణలో ఉద్యోగులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యేందుకు అంగీకరించేది లేదని హెచ్ఏఎల్ తేల్చి చెప్పింది.

ఫ్రెంచ్ న్యూస్ పోర్టల్ కథనం: కాంట్రాక్ట్ రావాలంటే రిలయన్స్‌తో ఒప్పందం తప్పనిసరి అన్న దసాల్ట్ అధికారి ఫ్రెంచ్ న్యూస్ పోర్టల్ కథనం: కాంట్రాక్ట్ రావాలంటే రిలయన్స్‌తో ఒప్పందం తప్పనిసరి అన్న దసాల్ట్ అధికారి

కాగా, అక్టోబర్ 13న హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగులతో రాహుల్ సమావేశం కావాలనుకున్నారు. హెచ్ఏల్ పనితీరును తెలుసుకుందామనే రాహుల్ ఈ సమావేశం కావాలనుకున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పారు.

రాఫెల్ ఒప్పందాన్ని హెచ్ఏఎల్ నుంచి లాక్కుని రిలయన్స్ డిఫెన్స్‌కు కట్టబెట్టారంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసింది. కాగా, రాఫెల్ డీల్ నేపథ్యంలోనే హెచ్ఏఎల్ ఉద్యోగులతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

HAL Denies Permission To Rahul Gandhi To Meet HAL Employees

ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌కు ఆఫ్‌సెట్ భాగస్వామిగా ప్రభుత్వ సారథ్యంలోని హెచ్ఏఎల్‌ సంస్థను కాదని వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన రిలయన్స్‌ను ఎందుకు ఎన్నుకున్నారో ప్రధాని మోడీని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ఇదో భారీ కుంభకోణమంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు.

English summary
HAL Denies Permission To Rahul Gandhi To Meet HAL Employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X