దేశంలో 40 పట్టణాల్లో భూకంప ప్రమాదాలకు అవకాశాలు

న్యూడిల్లీ :దేశంలోని సగం పట్టణాలకు భూ కంపాల ముప్పు ఉందని రిస్క్ మేనేజ్ మెంట్ సొల్యూషన్స్ సంస్థ హెచ్చరించింది. భూ కంపాల నుడి రక్షించుకొనేందుకు నివారణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది.

జపాన్ సహా ఇతర దేశాల్లో తరచూ భూకంపాలకు సంబందించిన వార్తలను వింటుంటాం. కాని, ఈ తరహా ప్రమాదాలు భారత్ లో కూడ ఉన్నాయని రిస్క్ మేనేజ్ మెంట్ సంస్థ హెచ్చరించింది. భూకంపాల నివారణకు చర్యలు తీసుకోకపోతే సగం దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది.

half of the country risk of earthquake

భారత్ లోని 40 పట్టణాలు హై రిస్క్ జోన్ లో ఉన్నాయని ఆ సంస్థ మెచ్చరించింది.దేశంలోని సగం ప్రాంతాల్లోని ఈ 40 పట్టణాలకు మరింత ప్రమాదం పొంచి ఉందని ఆ సంస్థ ప్రధాన పరిశోధక అధికారి రాబర్ట్ వుడ్ తెలిపారు.

ఆసియన్ మినిస్టీరియల్ కాన్పరెన్స్ ఆన్ డిజాస్టర్ రిడక్షన్ లో పాల్గొనేందుకు న్యూడిల్లీకి వచ్చిన ఆయన ఈ అంశాలను వెల్లడించారు.దేశంలో వేగంగా జనాభా పెరగడంతో పాటు, పర్యావరణ సమతుల్యత పాటించని కారణంగా భూకంపాలు చోటుచేసుకొనే ప్రమాదం పెరిగిందని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+