వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాండ్ బ్యాగ్ గన్ లు-జీపీఎస్ చెవి రింగులు-యూపీ వ్యక్తి విన్నూత్న ఆవిష్కరణ- మహిళా రక్షణకు..

|
Google Oneindia TeluguNews

దేశంలో అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రాల్లో యూపీ కూడా ఒకటి. ఇక్కడ మహిళల రక్షణ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. మహిళలపై నేరాలు రాష్ట్రంలో మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం 7 దాటితే వీధిలో నడవడం నుంచి పగటిపూట రద్దీగా ఉండే బస్సులో ఒంటరిగా ప్రయాణించడం వరకు, మహిళలు ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసి వస్తోంది. సమాజంలో ఆడవారు ఎదుర్కొంటున్న ఈ సవాళ్లను గుర్తిస్తూ, ఒక వ్యక్తి ఒక అడుగు ముందుకు వేసి పరిష్కారాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్యామ్ చౌరాసియా అనే వ్యక్తి తన సృజనాత్మక, వినూత్న ఆలోచనను ఉపయోగించి మహిళల కోసం స్వీయ రక్షణ కిట్‌ను రూపొందించాడు. కిట్‌లో పర్సు,చెప్పులు, చెవిపోగులు ఉన్నాయి. ఈ పరికరాలు ఆపదలో ఉన్న మహిళల్ని తక్షణమే సహాయం పొందేలా చేస్తాయి. చౌరాసియా రూపొందించిన పర్సును "స్మార్ట్ పర్స్ గన్" అంటారు.ఇది సాధారణ తుపాకీలా కనిపించినప్పటికీ,హ్యాండ్‌బ్యాగ్‌లోని చిన్న ఎరుపు బటన్ షాట్‌లను కాల్చేస్తుంది.

ఈ కిట్‌లో మరో అంశం "స్మార్ట్ యాంటీ రేప్ చెప్పులు". బ్లూటూత్ సౌకర్యం మినహా చెప్పులు హ్యాండ్‌బ్యాగ్‌తో సమానంగా ఉంటాయి. చెవిపోగుల విషయానికొస్తే, ఇది అత్యవసర కాల్ ఫీచర్‌తో పాటు జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజంను కలిగి ఉంది. చౌరాసియా తన ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ, మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సవాళ్లను చూసి వీటిని తయారు చేశానన్నాడు.

handbag guns and gps earrings-uttar pradesh mans help to womens self defence

ఈ పరికరాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కిట్‌ల ధర రూ.2497 అని. ఛార్జింగ్ చేసిన తర్వాత రెండు వారాల పాటు ఉత్పత్తులను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. అబ్దుల్ కలాం యూనివర్శిటీ (AKTU) ఇన్నోవేషన్ హబ్ చౌరాసియాకు ఈ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురావడంలో సహాయం చేస్తోంది.

English summary
an uttarpradesh women made handbag guns and gps earrings for women's self defence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X