బెంగళూరులో హ్యాపీగా బ్రతికేశా- ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయా: అమ్మాయి వీడియో వైరల్
దుబాయ్‌లో అధిక వేతనం పొందుతున్నప్పటికీ సంతోషంగా లేనని భారత్ కు చెందిన ఓ మహిళ టెక్కీ వెల్లడించారు. 18,000 రూపాయల జీతంతో బెంగళూరులో ఉద్యోగం చేస్తోన్నప్పుడు పొందిన ఆనందం.. ఇప్పుడిక్కడ దక్కట్లేదని అన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా శాలరీ వస్తోన్నప్పటికీ కెరీర్ సంతోషంగా సాగట్లేదని, జాబ్ శాటిస్ఫాక్షన్ ఉండట్లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆమె పేరు సీమా పురోహిత్. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆమె ఉద్యోగరీత్యా కొంతకాలం బెంగళూరులో నివసించారు. ఓ చిన్న స్థాయి సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ లో చేరారు. అప్పట్లో ప్రతి నెలా 18,000 రూపాయల జీతాన్ని తీసుకునేవారు. ఆ తర్వాత ఆమెకు మంచి ఆఫర్ రావడంతో దుబాయ్ వెళ్లారు. అక్కడే సెటిల్ అయ్యారు. ఇన్ స్టాగ్రామ్ లో అక్కడినుంచే ఈ వీడియోను పోస్ట్ చేశారు.

సీమా పురోహిత్ బెంగళూరు లైఫ్ ను గుర్తు చేసుకున్నారు.కేరీర్ లో మొట్ట మొదటి ఉద్యోగం బెంగళూరుకు చెందిన కంపెనీలోనేనని చెప్పారు. అక్కడ తన జీతం 18,000 రూపాయలు మాత్రమే. తొలి సంపాదన అందుకున్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలినని భావించానని అన్నారు. ఆ సమయంలో ఎంతో సంతోషంగా జీవించానని చెప్పుకొచ్చారు.
ఆ జీతంతోనే ఓ పీజీలో అద్దెకు ఉండేదాన్నని, స్ట్రీట్ షాపింగ్, క్యాంటీన్ భోజనాలు, ప్రతి వీకెండ్ లో స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి క్లబ్‌లకు వెళ్తుండేదానినని అన్నారు. అన్ని ఖర్చులూ పోను నెల చివరిలో కొంత డబ్బు సేవ్ అయ్యేదని వివరించారు. ఆ 18,000 రూపాయల జీతంతో సంతోషంగా గడిపానని, ఈ భూమిపై అత్యంత సంతోషంగా ఉన్న మహిళ తానేననే భావన చుట్టుముట్టేదని పేర్కొన్నారు.
దుబాయ్ కు వచ్చిన తర్వాత.. బెంగళూరును ఎంతో మిస్ అయ్యానని సీమా పురోహిత్ చెప్పారు. బెంగళూరులో గడిపిన రోజులను గోల్డెన్ డేస్ గా అభివర్ణించారు. దుబాయ్ లో ఎన్నో రెట్లు ఎక్కువ జీతం సంపాదిస్తున్నప్పటికీ, బెంగళూరులో ఉన్నంత సంతోషంగా లేనని ఆమె తేల్చి చెప్పారు. అధిక జీతం కోసం పరుగెత్తడం వల్ల ఆ ఆనందాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications