అల్లర్లు, విధ్వంసం: హార్దిక్ పటేల్‌కు రెండేళ్ల జైలు శిక్ష
అహ్మదాబాద్: పటేల్(పాటిదార్) రిజర్వేషన్ల కోసం పోరాడిన హార్దిక్ పటేల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2015లో పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసులో హార్దిక్ పటేల్‌కు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ గుజరాత్‌లోని స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో పాటు 50వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది.
మొత్తం 17మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో హార్దిక్ పటేల్ తోపాటు ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్‌తోపాటు సర్దార్ పటేల్ వర్గం నేత లాల్జీ పటేల్, ఏకే పటేల్‌ను కూడా దోషులుగా నిర్దారించింది. వీరికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది.

మరోవైపు తీర్పువెలువడిన వెంటనే హార్దిక్‌కు చెందిన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ నేతృత్వంలో 2015లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో హార్దిక్ పటేల్.. హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు నేడు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications