హర్థిక్ పటేల్‌కు షాక్: వరుణ్ పటేల్, రేష్మ పటేల్ బిజెపిలో చేరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఇబ్బందిగా మారిన పటేళ్ళ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన హర్ధిక్ పటేల్ సన్నిహితులు బిజెపిలో చేరారు. ఈ ఉద్యమంలో హర్థిక్ పటేల్‌తో వెన్నంటి ఉన్న వరుణ్ పటేల్, రేష్మ పటేల్ బిజెపిలో చేరడం హర్థిక్ పటేల్‌కు ఇబ్బంది కల్గించింది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గుజరాత్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అటు భాజపా, ఇటు కాంగ్రెస్‌ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.

Hardik Patel’s key aides join BJP ahead of Gujarat assembly elections

గుజరాత్ రాష్ట్రంలో ఈ నెలలో రెండుసార్లు పర్యటించారు ప్రధాని మోదీ. ఆదివారం నాడు మరోసారి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. పటేల్‌ వర్గీయులకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ గుజరాత్‌లో పెద్దఎత్తున ఆందోళన చేపట్టి వార్తల్లోకెక్కిన హార్దిక్‌ పటేల్‌ సన్నిహితులు ఇద్దరు భాజపాలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

పాటిదార్‌ ఆందోళనలో హార్దిక్‌తో పాటు కీలక పాత్ర పోషించిన వరుణ్‌ పటేల్‌, రేష్మ పటేల్‌లు భాజపాలో చేరారు.ఇప్పటికే హార్దిక్‌ పటేల్‌కు టికెట్‌ ఇస్తామంటూ కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆఫర్‌ను హార్దిక్‌ తిరస్కరించాడు.రాజకీయాలు తన లక్ష్యం కాదని.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని హార్దిక్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడి అనుచరులు ఇద్దరు బిజెపిలో చేరడం ఆసక్తిని కల్గిస్తోంది..

దీనిపై హర్దిక్‌ కూడా ట్విటర్‌ ద్వారా స్పందించాడు. 'తన కాళ్లలో కొన్ని విరిగిపోయినా సరే.. జెర్నీ తన పరుగును ఆపదు. ప్రజలు నాతో ఉన్నారు. వారి కోసం నా పోరాటం సాగుతూనే ఉంటుంది.' అని ట్వీట్‌ చేశాడు. గుజరాత్‌లో పటేల్‌ కమ్యూనిటీ శక్తిమంతమైనది. ఆ వర్గం మద్దతు ఉంటే విజయం దాదాపు ఖాయమైనట్లే అని భావిస్తారు రాజకీయ విశ్లేషకులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a dramatic turn of events in poll-bound Gujarat, quota spearhead Hardik Patel’s key aides—Varun Patel and Reshma Patel—on Saturday joined the ruling Bharatiya Janata Party .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి