హర్యానా ఎన్నికలు.. దళిత నేతలకు మాయావతి పిలుపు, టార్గెట్ ఫిక్స్!

త్వరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల రంగంలో ప్రజలను ఆకట్టుకునే పనులు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయగా, మొత్తం ఏడు హామీలతో ఉన్న ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.

దళిత నాయకులకు మాయావతి పిలుపు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తో పాటు దాని సహచర పార్టీలపైన బీఎస్పీ అధినేత్రి మాయావతి తనదైన శైలిలో దళిత నేతలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, దాని సహచర పార్టీలతో తమ బంధాన్ని తెంచుకోవాలని మాయావతి దళిత నాయకులను కోరారు. మాయావతి చేసిన ప్రకటన హర్యానాలో భారతీయ జాతీయ లోక్ దళ్ సహకారంతో దళిత అనుకూల ఫ్రంట్ ను ఏకీకృతం చేసే ప్రయత్నంలో భాగంగా చేసినట్లుగా చర్చ జరుగుతుంది.

Haryana elections Mayawati calls Dalit leaders as Congress target

దళిత నాయకులపై కాంగ్రెస్ ప్రేమ అందుకే
ఇక తన ప్రకటన ప్రకారం మాయావతి చారిత్రాత్మకంగా దళితుల గొంతులను అణగదొక్కిన సాంప్రదాయ రాజకీయ సంస్థలకు బదులు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ అనుబంధ పార్టీలపైన తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ట్విట్టర్లో పోస్టులు చేసిన మాయావతి దళిత నాయకులపై ఈ పార్టీలు అకారణంగా చూపించే ఆదరణపైన, ఆపైన తమకు అనుకూలంగా పరిస్థితులు మారిన తర్వాత పక్కన పెట్టే విధానంపైన మండిపడ్డారు.

కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ పార్టీలపై మాయావతి ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ మరియు ఇతర కులతత్వ పార్టీలు దళితులను ఆ పార్టీలకు గడ్డ సమయంలో మాత్రమే గుర్తు పెట్టుకుంటాయని, వారిని ముఖ్యమంత్రిగా లేదా తాత్కాలికంగా ఇతర కీలక పదవుల్లో నియమించుకుంటాయని, ఆపై వారిని పక్కకు నెడతాయని దేశంలో ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయని మాయావతి వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు దళిత నాయకుల కంటే కులతత్వ వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

అంబేద్కర్ బాటలో దళితుల కోసం రాజీనామా చేశానన్న మాయావతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళితులు మరియు ఇతర అట్టడుగు వర్గాల పట్ల జరిగిన అవమానాలకు నిరసనగా కేంద్ర న్యాయ మంత్రి పదవికి రాజీనామా చేశారని, 2017లో సహరాన్ పూర్ లో దళితులపై జరిగిన హింసపై నిరసనగా తాను కూడా అంబేద్కర్ బాటలో రాజ్యసభకు స్వయంగా రాజీనామా చేశానని పేర్కొన్నారు. బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అంబేద్కర్ తరహాలో తాను రాజ్యసభకు రాజీనామా చేసి ఆయన అడుగుజాడల్లో నడిచాను అన్నారు.

దళిత నేతలకు మాయావతి పిలుపు
ఇప్పుడు దళితులకు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నానని, దళిత సంక్షేమానికి, గౌరవానికి ప్రాధాన్యతను ఇచ్చే రాజకీయ పునర్నిర్మాణం జరగాలని మాయావతి చెబుతున్నారు. కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ అనుబంధ పార్టీలలో రాజ్యాంగ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక భావాలు ఉన్నాయి అని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆమె ఆయా పార్టీలతో ఉన్న తమ బంధాన్ని తెంచుకోవాలని దళిత నేతలకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+