Pension: పెళ్లికాని వారి కోసం పెన్షన్ స్కీమ్.. త్వరలో అమలు..!

మీరు వృద్ధాప్య పింఛన్ ఉంది. వికలాంగుల పింఛన్ ఉంది. గీత, నేత పింఛన్లు ఉన్నాయి. ఒంటరి మహిళాపెన్షన్ గురించి విన్నాము. త్వరలో పెళ్లి కాని వారికి కూడా పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు హర్యానాలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిసింది. పెళ్లికాని వారికి పింఛన్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పెళ్లికాని 45-60 ఏళ్ల వారికి పెన్షన్ ఇచ్చేందుకు రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించి విధివధానాలు కూడా తీసుకొచ్చింది. త్వరలోనే ఈ పథకం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ పథకాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు. నెల రోజుల్లోగా ఈ పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. హర్యానాలోని కర్నాల్ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

Haryana government

ఓ 60 ఏళ్ల వ్యక్తి సీఎం వద్దకు వచ్చి మాట్లాడాడు.పింఛన్ దరఖాస్తు లో తాను సమస్యలు ఎదుర్కొంటున్నాట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మనోర్ లాల్ ఖట్టర్ మాట్లాడారు. 45 ఏళ్లు దాటి.. పెళ్లికాని పురుషులు, మహిళలకు పెన్షన్ ఇచ్చేందుకు ఓ పథకాన్నీ తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి విధివిధాలన రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

వృద్ధాప్య పింఛనును కూడా వచ్చే ఆరు నెలల్లో రూ.3వేలకు పెంచనున్నట్లు సీఎం ప్రకటించారు. పెళ్లికాని వారికి ఇచ్చే పింఛన్ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించలేదు. తెలంగాణలో ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్నారు. అయితే ఇది కేవలం మహిళలకే ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+