వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ రాక్షసత్వం: భోజనం చేస్తున్న యువకుడిపై కత్తులతో దాడి, కారుకు కట్టి ఈడ్చుకెళ్లారు

హర్యానాకు చెందిన ఓ యువకుడిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. రాజకీయ నేత కుమారుడైన నిందితుడు మరో ఐదుగురితో కలిసి వ్యక్తిగత తగాదాల నేపథ్యంలో ఆ యువకుడి ఇంటికెళ్లి కత్తులతో దాడి చేశాడు. భోజనం చేస్త

|
Google Oneindia TeluguNews

ఛండీఘర్: హర్యానాకు చెందిన ఓ యువకుడిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. రాజకీయ నేత కుమారుడైన నిందితుడు మరో ఐదుగురితో కలిసి వ్యక్తిగత తగాదాల నేపథ్యంలో ఆ యువకుడి ఇంటికెళ్లి కత్తులతో దాడి చేశాడు. భోజనం చేస్తుండగా.. పళ్లెం విసిరేసి అతడ్ని తీవ్రంగా కొట్టారు.

అంతటితో ఆగకుండా కారుకు కట్టేసి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో ఆ యువకుడు తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. చండీగఢ్‌ సమీపంలోని పంచకుల ప్రాంతంలో ఈ ఘటన భయాందోళనలు సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడితోపాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.

murder

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాకేత్రి గ్రామానికి చెందిన వరీందర్‌కు, స్థానిక ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్ఎల్‌డీ) నేత గురుప్రీత్‌ కౌర్‌ వరైచ్‌ కుమారుడు మన్మీత్‌ సింగ్‌కు మధ్య కొన్ని నెలల క్రితం గొడవైంది. దీంతో వరీందర్‌పై కోపం పెంచుకున్న మన్మీత్‌ మంగళవారం రాత్రి తన స్నేహితులతో కలిసి అతడి ఇంటికి వెళ్లాడు.

వరీందర్‌ భోజనం చేస్తుండగా.. అతడిపై దాడి చేసి కత్తులతో గాయపరిచారు. ఆ తర్వాత వరీందర్‌ను కారుకు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కిలోమీటర్‌ దూరం వెళ్లాక అతడిని వదిలేసి మన్మీత్‌, తన స్నేహితోలతోపాటు వెళ్లిపోయాడు.

తీవ్రంగా గాయపడిన వరీందర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మన్మీత్ తోపాటు మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

English summary
A man was dragged down the streets before being attacked with swords allegedly by Haryana politician's son. The accused has been arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X