హర్యానా ఎన్నికల పోలింగ్, ఫలితాల తేదీల్లో మార్పులు: ఎందుకంటే?

ఛండీగఢ్: స్థానిక పండగను దృష్టిలో ఉంచుకుని హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం సవరించింది. అక్టోబర్‌ 1న పోలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా.. దానిని అక్టోబర్‌ 5కు మార్చింది. అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా.. అక్టోబర్‌ 8న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది.

కాగా, హర్యానా ప్రజలు తమ మూలపురుషుడు గురు జంబేశ్వర్‌ స్మారకంగా అసోజ్‌ అమవాస్య పండగను నిర్వహిస్తారు. ఈ వేడుకలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. బిష్ణోయ్‌ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో తేదీలు మార్చినట్లు ఈసీ వెల్లడించింది.

Haryana polls ECI changes polling counting date to accommodate Bishnoi community festival

ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్‌ తేదీలను మార్చినట్లు ఈసీ శనివారం ఓ ప్రకటన జారీ చేసింది.

సవరించిన తర్వాత ఎన్నికల తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ : సెప్టెంబర్ 05
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: సెప్టెంబర్ 12
నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ గడువు: సెప్టెంబర్ 16
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: అక్టోబర్ 05
ఎన్నికల ఫలితాల తేదీ: అక్టోబర్ 08

హర్యాలో మొత్తం 90 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో 73 జనరల్‌ స్థానాలు కాగా, 17 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలు ఇప్పటికే సీఈసీ రాజీవ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రెండు కోట్లకుపైగా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 4.52 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.

కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ దక్కించుకుంది. దీంతో దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్‌ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+