ద్వేషం, హింస భారతమాతకు మేలు చేయవు: ఈశాన్య ఢిల్లీలో రాహుల్ గాంధీ పర్యటన, ‘కరోనా’ అంటూ బీజేపీ
న్యూఢిల్లీ: హింస ఎవరికీ మేలు చేయదని, విద్వేషం, హింస అనేవి అభివద్ధికి, భారత మాతకు హాని చేస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ఇటీవల అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో బుదవారం పర్యటించారు. రాహుల్ వెంట పార్టీ నేతలు అధిర్ రంజన్ చౌదరి, రణదీప్ సింగ్ సుర్జేవాల, కుమారి షెల్జా, తదితరలు ఉన్నారు. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 47 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
ఈశాన్య ఢిల్లీలో రాహుల్ పర్యటన..
రెండు బృందాలుగా కాంగ్రెస్ బృందాలు అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కువగా ఎంపీలు ఉన్న మొదటి ప్రతినిధుల బృందం కేరళ హౌస్ నుంచి బయల్దేరింది. హిబి ఈడెన్, గుర్జీత్ సింగ్ అజ్ల, అబ్దుల్ ఖలేఖ్ ఈ బృందంలో ఉన్నారు.
ఇక రెండో ప్రతినిధుల బృందం రాహుల్ గాంధీ నేతృతంలో బయల్దేరింది. కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి తదితరులు పర్యటించారు. ఘర్షణలకు మూలకారణంగా ఉన్న బ్రిజ్‌పురి ప్రాంతంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో ధ్వంసమైన పాఠశాలను సందర్శించారు.
ద్వేషం, హింస అభివృద్ధికి, భారతమాతకు మేలు చేయవు
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ పాఠశాల ఢిల్లీ భవిష్యత్తు అని, ద్వేషం, హింసి దానిని నాశనం చేసిందన్నారు. ఈ ద్వేషం, హింస అభివృద్ధికి, భారతమాతకు ఎటువంటి ప్రయోజనం చేయవని అన్నారు. ఇలాంటి సమయంలో అంతా కలిసి ముందుకెళ్లాలని, దేశాన్ని అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.
ఇటలీ నుంచి వచ్చావు.. కరోనా టెస్ట్ చేయించుకున్నావా?
కాగా, రాహుల్ గాంధీ ఈశాన్య ఢిల్లీలో పర్యటించడంపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కేవలం ఆరు రోజుల ముందే రాహుల్ గాంధీ ఇటలీ నుంచి వచ్చారని.. విమానాశ్రయంలో ఆయన స్క్రీనింగ్ టెస్ట్ తీసుకున్నారా? లేదా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రమేష్ బిదురి. రాహుల్ గాంధీ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడా? లేక వైరస్ వ్యాప్తి చేయాలనుకుంటున్నాడా? అని ఆయన నిలదీశారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications