షీనాని చంపలేదని ఇంద్రాణీ ట్విస్ట్! ముంచిందని ఖన్నా
ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్! షీనా బోరాను తాను హత్య చేయలేదని తల్లి ఇంద్రాణీ చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆమెను పోలీసులు విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె.. తాను షీనా బోరాను తీవ్రంగా వ్యతిరేకించానని కానీ చంపలేదని చెప్పిందని సమాచారం.
తాను చెప్పేది నిజమని ఆమె చెప్పిందని తెలుస్తోంది. రెండో భర్త సంజీవ్ ఖన్నా ఈ హత్యకు కారణమని చెప్పిందని తెలుస్తోంది. కాగా, తనను ఇంద్రాణీ తనను నిండా ముంచిందని తన క్లోజ్ ఫ్రెండుతో సంజీవ్ ఖన్నా చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

షీనా బోరా హత్య
తన సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో పోలీసుల రిమాండులో ఉన్న ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియా మరో కొత్త విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. షీనా తన సొంత కూతురే అని ఇంద్రాణి తనతో ఎప్పుడో చెప్పిందని సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు.

షీనా బోరా హత్య
అంతకు ముందు, తన కుమరుడు రాహుల్ ముఖర్జియా (పీటర్ తొలి భార్య సంతానం)కు షీనాతో సంబంధం ఉందని పీటర్ తెలిపిన సంగతి తెలిసిందే.

షీనా బోరా హత్య
షీనా తల్లి ఇంద్రాణియే అని రాహుల్ తనతో అన్నాడని, అయితే ఈ విషయాన్ని ఇంద్రాణి కొట్టి పారేసిందని. షీనా తన చెల్లెలు అనే చెప్పిందని ఇంతకు ముందు పీటర్ చెప్పారు.

షీనా బోరా హత్య
రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్యకేసులో మరికొన్ని అంశాలు వెలుగుచూశాయి.

షీనా బోరా హత్య
షీనా హత్యకు గురైన రోజున తాను ముంబైలోనే ఉన్నానని, తన తల్లి తనను కూడా చంపాలనుకుందని ఇంద్రాణి కుమారుడు మిఖాయిల్ బోరా వెల్లడించారు.

షీనా బోరా హత్య
మూడేండ్ల క్రితమే రాయగడ్ జిల్లాలో పాక్షికంగా కాలిన షీనా మృతదేహం లభించినప్పటికీ, స్థానిక పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదన్న విషయం వెల్లడైంది.

షీనా బోరా హత్య
రాయగడ్ జిల్లాలోని పెన్ తెహసిల్ నుంచి వెలికితీసిన షీనా అస్థికలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. షీనా హత్యకు ఉపయోగించిన కారును గుర్తించామని పోలీసులు శనివారం తెలిపారు.

షీనా బోరా హత్య
నేరం జరిగిన తీరును పరిశీలించేందుకు ఘటన స్థలం వద్దకు ముగ్గురు నిందితులను తీసుకెళతామని చెప్పారు. ఈ హత్యలో తన పాత్రను ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా అంగీకరించినట్టు పేర్కొన్నారు.

షీనా బోరా హత్య
షీనా హత్య జరిగిన రోజు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా బసచేసిన హోటల్‌లో తాను కూడా ఉన్నానని మిఖాయిల్ బోరా శనివారం పోలీసులకు చెప్పారు.

షీనా బోరా హత్య
రాహుల్‌తో షీనా పెళ్లి, అలాగే ఆస్తి విషయమై మాట్లాడాలని తనను ముంబైకి పిలిపించి, వర్లీలోని హిల్‌టాప్ హోటల్‌లో పెట్టారని తెలిపారు. అనంతరం తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారని చెప్పారు. అది తాగగానే తనకు తల తిరిగినట్టయిందని, అదే సమయంలో తన తల్లి, సంజీవ్ ఖన్నాలు బయటకు వెళ్లారన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications