Ayodhya Ram Temple: అయోధ్య రామమందిరం తాజా ఫొటోలు చూశారా ?
అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు ఆధ్వరంలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే నెల22న రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహా కార్యక్రమానికి దేశ విదేశీ అతిధుల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ వేడుకకు ముందే అయోధ్యలో కొత్త రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
అయోధ్యలో జరుగుతున్న రామమందిరం నిర్మాణానికి సంబంధించిన అప్ డేట్స్ ను తీర్ధక్షేత్ర ట్రస్ట్ ఎప్పటికప్పుడు భక్తులకు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఫొటోల్ని ఎక్స్ లో ట్రస్ట్ షేర్ చేసింది. ఇందులో ఆలయ ముందు భాగంతో పాటు పలు యాంగిల్స్ లో తీసిన ఫొటోలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే నిర్మాణ కార్యక్రమాలు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో ఇట్టే అర్ధమవుతోంది.

Pictures taken this morning at Shri Ram Janmabhoomi Mandir site.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 24, 2023
श्री राम जन्मभूमि मंदिर परिसर में आज प्रातः काल लिए गए चित्र pic.twitter.com/MOaDIiS91Y
భారీ క్రేన్ల సాయంతో సాగుతున్న నిర్మాణ కార్యక్రమాలతో పాటు ఆలయం లోపల కూడా విగ్రహాల ఏర్పాటు కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఈ కార్యక్రమాలను మరో నెల రోజుల్లో పూర్తి చేసేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ లోపు నగరంలో కొత్త రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టుల్ని ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ నెల 30న కొత్త ఎయిర్ పోర్టు ప్రారంభం కానుంది. అనంతరం త్రేతా యుగాన్ని గుర్తుతెచ్చేలా ఆధునీకీకరించిన రైల్వే స్టేషన్ కూడా ప్రారంభం కానుంది. అనంతరం సంక్రాంతి పండుగ వస్తుంది. ఆ తర్వాత రామాలయం ప్రారంభోత్సవానికి యోగీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications