ఉపఎన్నిక ఓటమి భవిష్యత్‌లో భారీ విజయానికి సంకేతం: రాజ్‌నాథ్ ఆసక్తికరం
న్యూఢిల్లీ: తాజా విడుదలైన ఉప ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందన ఆసక్తికరంగా ఉంది. భారీ విజయాలు అందుకునే క్రమంలో ఎవరైనా రెండు అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుందని, భవిష్యత్‌లో భారీ ముందడుగు వేయబోతున్నామని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ఓటమి రాబోయే రోజుల్లో తమ పార్టీ సాధించే ఘన విజయానికి సంకేతమని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. తాజాగా విడుదలైన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీని విపక్షపార్టీలు ఐక్యంగా పోటీ చేసి దెబ్బతీసిన విషయం తెలిసిందే.

4లోకసభ, 10అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కేవలం 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే సీటును బీజేపీ గెలుచుకుంది. దీంతో విపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. మిత్రపక్షం శివసేన కూడా పాల్ఘర్‌లో తమ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బులు పంచి బీజేపీ గెలుపొందిందని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications