'భార్యల మార్పిడి' కేసులో, భర్తకు అనుకూలంగా హైకోర్టు..

Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్ : భార్యల మార్పిడి కేసులో ఒడిశా పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులకు, ఆయన కుమారుడు సబ్యసాచి మిశ్రాకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టులపై 'స్టే' విధిస్తూ ఈ నెల 29వ తేదీ వరకు పోలీసులు వారిని అరెస్టు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

గత నెలలో త్రైలోక్యనాథ్ కోడలు లోపముద్ర.. భర్త, అత్తింటి వారి వేధింపులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో లోపముద్ర ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతుండగా, తాజాగా పోలీసులకు హైకోర్టు బ్రేక్ వేసింది.

HC grants interim protection to Odisha industrialist, wife and son

ఈ నెల 29వ తేదీ వరకు అరెస్టులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అక్కడి హైకోర్టు, ఆలోపు కేసుకు సంబంధించిన డైరీని కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఇదిలా ఉంటే, తమ పెళ్లయిన తొలినాళ్లలో.. 2006లో హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లిన సందర్బంలో తన భర్త వైఫ్ స్వాపింగ్ (భార్యల మార్పిడి) కు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా లోపముద్ర తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇన్నాళ్లూ భర్త వేధింపులను ఓపిక పడుతూ వచ్చినా.. భర్తలో ఎలాంటి మార్పు రాకపోగా, అత్త మామలు కూడా అతనికి తోడవడంతో వేధింపుల పర్వం ఎక్కువైందని, దీంతో తన ప్రాణాలకు హాని జరిగే అవకాశం ఉండడంతో పోలీసులను ఆశ్రయించినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది లోపముద్ర.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mishra had moved the High Court on June 15 seeking anticipatory bail for himself, his son Sabyasachi and wife Asha Manjari in the dowry torture case filed by his daughter-in-law Lopamudra-wife of Sabyasachi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి