కల్నల్ సోఫియా ఖురేషీపై విమర్శలా ? మధ్యప్రదేశ్ మంత్రికి హైకోర్టు షాక్..!
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను నడిపించిన ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో సోఫియాను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపాయి. ఆమె మతాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విజయ్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన వక్రబుద్దికి నిదర్శనంగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇవాళ బీజేపీ మంత్రి విజయ్ షాపై తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించిన హైకోర్టు.. తక్షణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వ్యాఖ్యలు వాస్తవమని తేలితే హైకోర్టు తగిన చర్యలు తీసుకోబోతోంది.

నిన్న మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా మోహౌలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ తమ సోదరీమణులు, కుమార్తెల సిందూరాన్ని తీసేసిందని, తాము వారి స్వంత సోదరిని వారికి తిరిగి ఇవ్వడానికి పంపామంటూ కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారు హిందువుల బట్టలు విప్పి చంపారని, మోడీ-జీ వారి సోదరిని తిరిగి ఇవ్వడానికి పంపారని ఆరోపించారు.
తాము పాకిస్తాన్ బట్టలు విప్పలేకపోయామని, కాబట్టి మేము వారి సంఘం నుండి ఒక కుమార్తెను పంపామంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు మా సంఘంలోని వితంతువు సోదరీమణులు, కాబట్టి మీ సంఘంలోని ఒక సోదరి మిమ్మల్ని నగ్నంగా చేస్తుందంటూ రెచ్చిపోయారు. ప్రతీకారం తీర్చుకోవడానికి మీ కులంలోని కుమార్తెలను పాకిస్తాన్‌కు పంపవచ్చని మోడీ-జీ నిరూపించారని విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు సుమోటో కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications