వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడు సూపర్ .. ! ఇక్కడ మోసాలు..! అక్కడ థాయ్ మసాజ్ లు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : త‌న‌ది కాదు త‌న అత్త‌గారి సొమ్మంటే ఎవ‌రైనా జీవితాన్ని ఎంజాయ్ చేయ‌కుండా ఉండ‌రు. కాని ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయ్యింది. నిరుద్యోగుల సొమ్ముతో విలాస‌వంత‌మైన జీవితానికి మ‌రిగిన ముఠా ఇప్పుడు ఊచ‌లు లెక్కిస్తోంది. థాయ్‌లాండ్‌లో మసాజ్‌లు, బ్యాంకాక్‌లో జల్సాలు! పబ్‌లలో రోజుకు లక్షకు పైగా ఖర్చు! మొత్తంగా వారంతా విలాస పురుషులు..! మరి వారికి ఇంత డబ్బెలా వ‌చ్చంది అంటారా? నిరుద్యోగమే పెట్టుబడి. అంటే..

ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను నమ్మిస్తారు. ఎస్బీఐ, రైల్వే, ఆదాయపన్ను విభాగంలో కొలువులు ఇప్పిస్తామని ఊదరగొడతారు. శిక్షణ పేరిట వారికి క్లాసులూ నిర్వహించి అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా ఇస్తారు. ఇలా ఒక్కొక్కరి నుంచి 10-15 లక్షల రూపాయ‌ల‌ చొప్పున వసూలు చేసి 4కోట్ల రూపాయ‌ల‌కు పైగా కాజేశారు. చివ‌ర‌కు వారి పాపం పండింది. నిరుద్యోగుల ఉసురు వారికి త‌గిలింది. అంతే 11మందితో కూడిన ఓ అంతర్రాష్ట్ర ముఠా దందాను రాచకొండ పోలీసులు రట్టు చేశారు.

కోల్ క‌తాలో శిక్ష‌ణ‌..! ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగం అంటూ ప‌చ్చి మోసం..!!

కోల్ క‌తాలో శిక్ష‌ణ‌..! ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగం అంటూ ప‌చ్చి మోసం..!!

పదకొండు మందిలో పాటు ప్రధాన నిందితుడు ఒడిసాకు చెందిన కాలు చరణ్‌ పండా. ఇతడికి అజయ్‌, మనోజ్‌, కరణ్‌ అనే పేర్లూ ఉన్నాయి. ఐదేళ్ల క్రితం కోల్‌కతాకు బతుకుదెరువు కోసం వెళ్లాడు. జల్సాలకు మరిగాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్నేహితులతో ముఠా ఏర్పరచుకున్నాడు. ఒడిసా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కొన్ని జాబ్‌ కన్సల్టెన్సీలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని, నిరుద్యోగుల ఫోన్‌ నంబర్లను సేకరించాడు. స్నేహితుల ద్వారా నిరుద్యోగులకు ఫోన్‌ చేసి, తమ కన్సల్టెన్సీ ద్వారా కచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని, ట్రైనింగ్‌ కూడా తామే ఇస్తామని నమ్మించాడు. హైదరాబాద్‌లోని ఒక కన్సల్టెన్సీలో పనిచేస్తున్న చింతకింది శ్రీకాంత్‌, ఏపీలోని గుంటూరుకు చెందిన కడియాల సంధ్యారాణిలతో పరిచయం పెంచుకొని కమీషన్‌ కింద తన ముఠాలో చేర్చుకున్నాడు.

 పాపం నిరుద్యోగులు..! ఉద్యోగం వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఎంతంటే అంత క‌ట్టారు..!!

పాపం నిరుద్యోగులు..! ఉద్యోగం వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఎంతంటే అంత క‌ట్టారు..!!

నిరుద్యోగులు ఆ లెటర్‌ తీసుకొని ఎస్బీఐ, రైల్వే, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్టుమెంట్లలో ఉద్యోగం కోసం వెళితే అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. దాంతో మోసపోయామని తెలుసుకున్న కేతావత్‌ మోహన్‌ నాయక్‌, బానోతు మోహన్‌, కిషన్‌, రమేశ్‌ అనే నిరుద్యోగులు ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించారు. సీపీ భగవత్‌, రాచకొండ స్పెషల్‌(ఎస్ వోటీ ) పోలీసులను రంగంలోకి దింపారు. ఎస్‌వోటీ ఏడీసీపీ సురేందర్‌ రెడ్డి పర్యవేక్షణలో మల్కాజ్‌గిరి ఎస్‌వోటి ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌, రవిబాబు, ఉప్పల్‌ పోలీసులు తన సిబ్బందితో రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలు సేకరించి, కోల్‌కతాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలో నలుగురు చరణ్‌ పండా, మురళీకృష్ణ, వీరరాఘవరెడ్డి, సంధ్యారాణిలను అదుపులోకి తీసుకున్నారు.

 4 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర ముఠా..! నలుగురు అరెస్టు, 35 లక్షల సొత్తు స్వాధీనం..!

4 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర ముఠా..! నలుగురు అరెస్టు, 35 లక్షల సొత్తు స్వాధీనం..!

శ్రీకాంత్‌, సంధ్యారాణి, తన మిత్రులు కాలినాథ్‌ రాయ్‌, హేమంత్‌, అనిల్‌, రాజీవ్‌ కార్తీక్‌, పానుగంటి వెంకటేశ్‌, అశోక్‌రావు, అలోక్‌ వర్మా, రమా ప్రసన్ని, వీరరాఘవరెడ్డి, మురళీకృష్ణ సహకారంతో 100మందికి పైగా నిరుద్యోగులను ఆకర్షించారు. కేటుగాళ్లను నమ్మిన చాలామంది నిరుద్యోగులు కోల్‌కతాలో శిక్షణకు హాజరయ్యారు. ఈ బాధ్యతను మురళీకృష్ణ చూశాడు. ముఠాలోని కొందరిని బ్యాంకు, రైల్వే, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్టుమెంట్లలో ఉన్నతోద్యోగులుగా పరిచయం చేసేవారు వారి ద్వారానే తమకు ఉద్యోగాలు వస్తున్నాయని నమ్మించేవారు. శిక్షణ ముగిసిందని చెప్పి, వారికి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చేవారు. పదిరోజుల్లో వెళ్లి ఉద్యోగంలో చేరాల్సిందిగా నమ్మించి కోల్‌కతా నుంచి పంపేశారు.

 ఖ‌రీదైన విల్లాలు..! ల‌క్స‌రీ కార్లు..! ఇదే మోస‌గాళ్ల హైఫై మెరుగులు..!!

ఖ‌రీదైన విల్లాలు..! ల‌క్స‌రీ కార్లు..! ఇదే మోస‌గాళ్ల హైఫై మెరుగులు..!!

మోసం చేసిన డబ్బుతో ఈ ముఠా విల్లాలు, ఖరీదైన కార్లు కొనుగోలు చేసి లగ్జరీ జీవితాన్ని గడిపింది. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు నిర్ణయించిన కేటుగాళ్లు నిరుద్యోగుల నుంచి 10-15లక్షల రూపాయ‌లు వసూలు చేశారు. మొత్తం వంద మందికి పైగా నిరుద్యోగులను ముంచి సుమారు 3కోట్ల రూపాయ‌ల‌ను కొల్లగొట్టారు. కోల్‌కతాలో ప్రతి రోజు పబ్‌లకు వెళ్లడం, మద్యం తాగి, డ్యాన్సర్లతో ఆడిపాడడం వారికి నిత్య కృత్యం. బ్యాంకాక్‌లో అమ్మాయిలతో జల్సాలు, థాయ్‌లాండ్‌లో మసాజ్‌లు, ఖరీదైన హోటళ్లలో లగ్జరీ జీవితాన్ని గడిపాడు. కోల్‌కతాలో ఖరీదైన విల్లా కొనుగోలుకు, ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు అగ్రిమెంట్‌ చేసుకొని 65లక్షలు చెల్లించాడు. ఇంత పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన కాలు చరణ్‌ చదివింది ఇంటరే. నిందితుల నుంచి 10.5లక్షల నగదు, 15లక్షల విలువైన హోండా కారు, 7తులాల బంగారం, ల్యాప్‌టాప్‌-3, నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు సహా మొత్తం 35లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.

English summary
The unemployed are believed to be working. SBI, Railways, and the Income Tax Department are blowing up. In the name of training they will be given classes and appointment letters. Rs. 10-15 lakh was collected from each of them for over Rs 4 crore. Finally the entire team caught by hyderabad police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X