వాళ్లిద్దరి అక్రమ సంబంధానికి హెడ్ మాస్టర్ బలి
చెన్నై : పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల అక్రమ సంబంధం.. హెడ్ మాస్టర్ ప్రాణాలకు మీదకు తెచ్చింది. అక్రమ సంబంధం ఆరోపణలు రుజువవడంతో.. ఆ ఉపాధ్యాయులిద్దరినీ సస్పెండ్ చేయగా..! నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను హెడ్ మాస్టర్ ను కూడా బదిలీ చేశారు. దీంతో చేయని తప్పుకు తనపై వేటు పడిందని మనస్తాపానికి గురైన సదరు హెడ్ మాస్టర్ ఆత్మహత్యకు యత్నించింది.
తమిళనాడులోని తంజావూరు జిల్లా పిన్నయూర్ పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంచాయితీ పరిధిలోని స్థానిక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరి ఉపాధ్యాయుల మధ్య చాలాకాలంగా అక్రమ సంబంధం నడుస్తోంది. ఇదే విషయమై జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో విషయంపై విచారణ జరిపించగా.. అక్రమ సంబంధం నిజమేనని తేలింది.

అయితే వివాహేతర సంబంధం రుజువు కావడంతో.. ఆ ఇద్దరు టీచర్స్ ను సస్పెండ్ చేసిన అధికారులు, వీరిద్దరి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ప్రధానోపాధ్యాయురాలైన కృష్ణవేణిని వేరే పాఠశాలకు బదిలీ చేశారు. దీంతో ఏ తప్పు చేయకుండానే తనపై వేటు పడిందనని మనస్తాపం చెందిన కృష్ణవేణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం తంజావూర్ లోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications