రైతు సంఘాల నేతల నిరాహార దీక్ష -ప్రభుత్వం దిగిరాకుంటే ఆమరణ నిరశన -సీఎం ఉపవాస దీక్ష

వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేస్తున్నారు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో తలపెట్టిన నిరసనలు ఆదివారంతో 18వ రోజుకు చేరాయి. దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. తదుపరి కార్యాచరణలో భాగంగా అన్ని రైతు సంఘాల నేతలు నిరాహార దీక్షకు దిగనున్నారు..

దేశ రాజధాని ఢిల్లీని కలిపే ముఖ్యమైన హైవేలను ఆదివారం నుంచి బ్లాక్ చేయగా, రైతు సంఘాల నేతలు సోమవారం(డిసెంబర్ 14)న నిరాహార దీక్షకు దిగనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు రైతు సంఘాల ఐకాస ఆదివారం ప్రకటించింది. ఢిల్లీలో దీక్షలకు మద్దతుగా..

 Heads of all protesting farmer unions to be on hunger strike on Monday against agri laws

దేశంలోని ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు రైతుల సంఘాలు తెలిపాయి. ప్రభుత్వం దిగిరాకుంటే డిసెంబర్​19నుంచి లక్ష మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని సంఘాలు హెచ్చరించాయి. రైతుల‌ నిరాహార దీక్ష‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం, ఆమ్ఆద్మీ పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. అంతేకాదు,

రైతుల‌కు మ‌ద్ద‌తు నిలుద్దామంటూ ఆమ్ఆద్మీ పార్టీ కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారులు, ఇత‌ర ప్ర‌జానీకానికి ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు. రైతుల‌కు మ‌ద్దతుగా సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అంద‌రం ఉప‌వాసాలు చేద్దామ‌ని కేజ్రివాల్ కోరారు. అందరితోపాటే రేపు తాను కూడా ఉప‌వాస దీక్ష చేస్తాన‌ని కేజ్ర‌వాల్ వెల్ల‌డించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+