మామిడి ప్రియులకు FSSAI శుభవార్త..! ఈసారి మగ్గబెట్టని పండ్లను తినొచ్చు..!
మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు .. చెట్టు మీద సహజంగా కాసే మామిడి పండ్లు తినాలని అందరూ అనుకుంటారు. కానీ అదంతా గతంలా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండ్లనే తినాల్సిన పరిస్ధితి. చెట్టు మీద కాయగా ఉన్నప్పుడే మామిడిని తెంచేసి కార్బైడ్ చల్లేసి పసుపు రంగులోకి మార్చేసి కస్టమర్లకు అమ్మేస్తే చాలని వ్యాపారులు భావిస్తున్నారు. ఇవి తిన్న జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు.
ఈ ఏడాది మామిడి ప్రియులకు అలాంటి బాధలు లేకుండా చేసేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) అసురక్షిత ఆహార పద్ధతులపై నిఘాను తీవ్రతరం చేసింది. పండ్లను కృత్రిమంగా పండించే రసాయనాల అక్రమ వాడకాన్ని కట్టడికి రాష్ట్రాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను ఇకపై కాల్షియం కార్బైడ్ తో పండించడానికి వీల్లేదని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు కృత్రిమంగా పళ్లను మగ్గబెట్టడంపై పూర్తిగా నిషేధం విధించింది.

FSSAI has ordered strict enforcement across states to intensify action against illegal fruit ripening agents, reiterating that the use of calcium carbide for artificial ripening of fruits such as mangoes, bananas & papayas is strictly prohibited. pic.twitter.com/OJ6JBqRn7u
— FSSAI (@fssaiindia) April 16, 2026
కాల్షియం కార్బైడ్ వాడకం ప్రమాదకరమని, ఇది ఎసిటిలీన్ గ్యాస్‌ను విడుదల చేయవచ్చని, దానిలో ఆర్సెనిక్, ఫాస్పరస్‌ల ఆనవాళ్లు ఉండవచ్చని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. దీనివల్ల వాంతులు, వికారం, చర్మపు చికాకు, శ్వాస ఇబ్బందులు కలుగుతాయని తెలిపింది. మరోవైపు కాల్షియం కార్బైడ్‌తో పాటు, ఇథెఫాన్ ద్రావణాల దుర్వినియోగం పైనా FSSAI దృష్టి సారించింది. పండ్లతో ఇథిలీన్‌ను (పౌడర్/ద్రవ రూపంలో) నేరుగా సంబంధం కలిగి ఉండటాన్ని నిషేధించింది. కేవలం నియంత్రిత రైపనింగ్ గదులలో ఎథిలీన్ గ్యాస్ వాడకానికి మాత్రమే అనుమతి ఉంది. అక్రమ పండ్ల పెంపకం నిషేధాన్ని అమలు చేయడానికి, FSSAI రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్‌లకు తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. మార్కెట్‌లు, నిల్వ, పంపిణీ కేంద్రాలపై నిఘా, నిషేధిత రసాయనాల వాడకానికి అడ్డుకట్టకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications