Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐటీ దాడులు: మంత్రి కుమార్తె పరీక్ష గోవింద, ఇంటి నుంచి పంపించం!

చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ అధికారులు, సిబ్బంది మీద విరుచుకుపడ్డారు. తన కుమార్తెను పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో అధికారుల తీరు సరిగా లేదని విమర్శించారు.

శుక్రవారం వేకువ జామున నుంచి తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి విజయభాస్కర్ సన్నిహితులు, బంధువు ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నారు.

Health minister Vijayabhaskar has slammed CRPF sleuths for not allwoing his child to attend the exams

మంత్రి విజయభాస్కర్ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో సీఆర్ పీఎఫ్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మంత్రి విజయభాస్కర్ కుమార్తె పరీక్ష రాయడానికి స్కూల్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి సీఆర్ పీఎఫ్ సిబ్బంది అంగీకరించలేదు.

ఇదే సందర్బంలో ఇంటిలో ఉన్న మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. మా అమ్మాయి పరీక్ష రాయకపోతే ఒక సంవత్సరం వృదా అవుతుందని మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ సిబ్బందికి చెప్పారు. అయితే మంత్రి కుమార్తెను ఇంటి నుంచి బయటకుపంపించడానికి ఆదాయ పన్ను శాఖ అధికారులు, సీఆర్ పీఎఫ్ సిబ్బంది నిరాకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+