BAN: దేశవ్యాప్తంగా 16 రకాల మందులపై తక్షణ నిషేధం.. లిస్ట్ ఇదే

దేశవ్యాప్తంగా వైద్య రంగాన సరికొత్త సంచలనం రేపుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో.. దేశంలో విస్తృతంగా వాడుకలో ఉన్న 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులపై తక్షణమే అమల్లోకి వచ్చేలా దేశవ్యాప్త నిషేధం విధించింది. ఈ మందుల వాడకం వల్ల ఎలాంటి అదనపు వైద్య ప్రయోజనాలు లేవని, పైగా వీటివల్ల రోగులకు రిస్క్ పెరిగే అవకాశం ఉందని శాస్త్రీయ సమీక్షలో తేలడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 లోని సెక్షన్ 26A ప్రకారం ఈ నిర్ణయాన్ని అధికారికం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

అసలు ఈ కాంబినేషన్ (FDC) మందులంటే ఏమిటి?

రెండు లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్ (ఔషధాల మిశ్రమం) ఒకే మోతాదులో (సింగిల్ టాబ్లెట్ లేదా సిరప్ రూపంలో) కలిపి తయారు చేసే వాటిని 'ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్' (FDC) మందులు అంటారు. ఈ తరహా ఔషధాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 'డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు' ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మార్కెట్లో ఉన్న మందులను క్షుణ్ణంగా పరిశీలించి.. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు, వైద్యపరమైన సమర్థన లేని, హానికరమైన 16 కాంబినేషన్లను గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టింది.

List of 16 banned pharmaceutical drugs

నిషేధిత జాబితాలో ఉన్న ప్రముఖ మందులు ఇవే..

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ 16 రకాల ఔషధాల జాబితాలో మనం నిత్యం వాడే పలు యాంటీబయాటిక్స్, నొప్పుల నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్), గ్యాస్ట్రిక్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి..

యాంటీబయాటిక్స్:

అమోక్సిసిలిన్ విత్ సెర్రాటియోపెప్టిడేస్; అమోక్సిసిలిన్, సెర్రాటియోపెప్టిడేస్, లాక్టోబాసిల్లస్ స్పోరోజెనస్; సెఫురోక్సిమ్ విత్ సెర్రాటియోపెప్టిడేస్ వంటి అత్యధికంగా వాడే యాంటీబయాటిక్ కాంబినేషన్లు.

పెయిన్ కిల్లర్స్ & ఇతర అలవెన్సులు:

ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్‌తో ఇథోహెప్టాజైన్ మిశ్రమం; డైసైక్లోమైన్, పారాసిటమాల్, క్లిడినియం బ్రోమైడ్ కాంబినేషన్లు.

చర్మ సౌందర్య లోషన్లు/క్రీములు:

కలబంద (అలోవెరా లేదా అలో ఎక్స్‌ట్రాక్ట్)తో విటమిన్-E, జోజోబా ఆయిల్, ఆరెంజ్ ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ వంటివి కలిపి తయారుచేసే పలు డెర్మటోలాజికల్ లోషన్లపై కూడా కేంద్రం నిషేధం విధించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

మార్కెట్‌లో అందుబాటులో ఉండే మందులు శాస్త్రీయ ఆధారాలతో, ప్రజలకు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ 16 రకాల మందుల తయారీ, అమ్మకాలు, పంపిణీ మరియు సరఫరాను తక్షణమే నిలిపివేయాలని ఫార్మా కంపెనీలు, ఇంపోర్టర్లు, డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించింది. రాష్ట్రాల స్థాయిలోని డ్రగ్ కంట్రోల్ సంస్థలు మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు అలర్ట్ అయి, ఈ నిషేధ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+