డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువతి మృతి.. 12 ఏళ్ల తమ్ముడు సైతం.. వీడియో వైరల్
అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా సంతోషంగా గడిపిన ఆ కుటుంబం బోరున విలపించింది. సోదరి పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ ఓ యువతి గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని విధిశా జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఏం జరిగింది..?
మధ్యప్రదేశ్ లోని ఇందోర్ కు చెందిన పరిణీత జైన్.. తన సోదరి సంగీత్ ఈవెంట్ లో స్టేజీపై సరదాగా డాన్స్ చేస్తున్నారు. ఇంతలో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే డాన్స్ ఆపేసి కుప్పుకూలిపోయింది. దీన్ని గమనించిన పరిణీత కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే హార్ట్ ఎటాక్ తో పరిణీత మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకున్నాయి.

क्या पता मौत कभी भी आ सकती है।
— Khinyaram Bhadoo (@Kram4barmer) February 9, 2025
स्टेज पर डांस करते करते अचानक गिर पड़ी युवती और फिर हो गई मौत !! pic.twitter.com/RKeamSCGbQ
అయితే గతంలో పరిణీత సోదరుడు కూడా గుండెపోటుతోనే మరణించాడట. అప్పుడు అతనికి కేవలం 12ఏళ్లు మాత్రమేనట. అక్కా తమ్ముడు ఇద్దరూ హార్ట్ ఎటాక్ తో చిన్న వయసులోనే దూరం కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications