రూ.లక్షకు రూ.3.50 లక్షలిచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్
మార్కెట్లలో ట్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకుంటుండాలి. వారి సలహాపైనే పెట్టుబడులు పెడుతుండాలి. అప్పుడే రిస్క్ లేకుండా లాభాలను ఆశించవచ్చు. మార్కెట్ పై కనీస అవగాహన ఉంటే చాలు.. లాభాలు తర్వాత అవే వస్తాయి. కంపెనీలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. ఎలాంటి ప్రణాళికతో వస్తున్నాయి? వాటి పెట్టుబడి వ్యూహాలేంటి? ప్రకటనలు ఎలా ఉన్నాయి? ఫలితాలు ఎలా ఉంటున్నాయి ఇత్యాది వివరాలు తెలుసుకుంటుంటే ఒక అవగాహన ఏర్పడుతుంది.
దీనివల్ల ఏ కంపెనీ షేర్లు పెరుగుతాయో, ఏ కంపెనీ షేర్లు తగ్గుతాయో ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని స్టాక్స్ తమ విలువను ఎన్నో రెట్లు పెంచుకుంటుంటాయి. వీటిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. పెట్టుబడిదారులకు ఊహించని రీతిలో ఇవి రిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటి ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం.

హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్. సంవత్సర కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. 2020 జూన్ 20న రూ.51.05 వద్ద ఉన్న ఈ స్టాక్ .. 2023, జూన్ 20 నాటికి రూ.182.60కి చేరుకుంది. హోల్డింగ్ పిరియడ్ అయిన సంవత్సరంలోనే 258 శాతం పెరిగింది. రూ. లక్ష పెట్టుబడి పెట్టినవారికి రూ.2.58 లక్షల లాభం వచ్చింది. మొత్తం విలువ రూ.3.58 లక్షలవుతోంది.

ఈ కంపెనీ 1981లో ప్రారంభమైంది. పవర్ ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాలిమర్ సెగ్మెంట్ లో ఇది లీడింగ్ కంపెనీ. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం 18.95 శాతం పెరిగింది. అది రూ.657.36 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.73.37 కోట్లుగా, ఇక కంపెనీ PAT రూ.20.87 కోట్లుగా ఉంది. త్రైమాసికాలవారీగా చూస్తే కంపెనీ నికర లాభం 200 శాతం ఎగబాకడం విశేషం. 2023, జూన్ 17న ఈ కంపెనీ రూ.1135 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.












Click it and Unblock the Notifications