ఢిల్లీని ముంచెత్తిన వాన: రహదారులు జలమయం
ఈ సారి వర్షాలు ఎక్కువే కురిశాయి. అక్టోబర్ వచ్చిన వాన తగ్గుముఖం పడటం లేదు. దాదాపు చలికాలం స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా ఇలాంటి సిచుయేషన్.. ఇక దేశ రాజధాని ఢిల్ీ గురించి చెప్పక్కర్లేదు. కొద్దిపాటి వర్షాలకే సిటీ అల్లకల్లోలం అవుతుంది.
గత 40 గంటలుగా ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వర్షపు నీరు కాలనీలు, లోతట్టు ప్రాంతల్లోకి చేరింది. రోడ్డుపైకి నీరు రావడంతో అప్పటికే దారిలో ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నారు. సప్దార్ జంగ్‌లో 74.3, లోధి రోడ్ 87.2, అయయ్ నగర్‌లో 85.2 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది. ఢిల్లీ రిడ్జ్ రోడ్‌లో 60, పాలెంలో 63 మి.మీ వర్షం పడింది.

భారీ వర్షం వల్ల ఢిల్లీలో వాహనదారులకు ట్రాపిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు. వర్షం పడిన కొందరు అత్యవసరం అయినందున బయటకు వచ్చారు. గొడుగు, రెయిన్ కోట్ వేసుకొని మరీ వచ్చారు.
ఆదివారం కూడా వర్ష ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత 50 ఏళ్ల గరిష్ట స్థాయిలో వర్షం కురిసిందట. 1969లో ఇలా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2007 తర్వాత ఢిల్లీలో అత్యధిక వర్షం ఈ ఏడాదే కురిసింది.












Click it and Unblock the Notifications