• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళ లో వర్ష బీభత్సం ; కూటిక్కల్‌లో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి, 10 మంది గల్లంతు

|
Google Oneindia TeluguNews

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అక్టోబర్ 16 నుండి కేరళలో భారీ వర్షం కురుస్తోంది, దీని వలన అనేక జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారయ్యింది . అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. 2018 వరదల సమయంలో కురిసిన భారీ వర్షాలతో సమానంగా ప్రస్తుతం భారీ వర్షాలు కేరళ రాష్ట్రంలో కురుస్తున్నాయి. కేరళలోని పతనమిట్టలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.

కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు మృతి, 13 మంది గల్లంతు
కొట్టాయం, కూటిక్కల్ పంచాయతీలో కొండచరియలు విరిగిపడటంతో కనీసం 13 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. కూటిక్కల్ తీవ్ర విషాదంలో చిక్కుకుంది . పంచాయితీలో రెస్క్యూ పనులు చేసేందుకు కేరళ ప్రభుత్వం భారత నావికాదళం సహాయం కోరింది. తొడుప్పుజాలో కారు కొట్టుకుపోవడంతో ఒక బాలిక మరణించింది. భారీగా కురుస్తున్న వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది.

heavy rains in Kerala; Three died, 10 injured in landslide in Koottickal

తిరువనంతపురంలో నీట మునిగిన పంట పొలాలు
తిరువనంతపురం జిల్లాలోని ప్రధాన డ్యామ్‌లు వాటి సామర్థ్యానికి చేరుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా ఇలాగే వర్షాలు కురిస్తే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం కనిపిస్తుంది . తిరువనంతపురంలోని అరట్టు కడవు వద్ద ఇళ్లు మరియు వరి పొలాలు వర్షాల కారణంగా నీట మునిగిపోయాయి. వివిధ డ్యామ్‌ల గేట్లను ఎత్తివేయటంపై తిరువనంతపురం మరియు పత్తనంతిట్ట జిల్లా యంత్రాంగాలు ఇరిగేషన్ శాఖాధికారులను హెచ్చరించాయి. రెండు జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షాలు నమోదు అయ్యాయి.

నెయ్యార్ డ్యామ్ లో ప్రమాద స్థాయికి చేరుకున్న నీరు
తిరువనంతపురంలో, అత్యవసర ప్రయోజనాల కోసం ప్రజలు తమ ప్రయాణాలను పరిమితం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్ళటం నిషేధించబడింది. నెయ్యార్ డ్యామ్ యొక్క నాలుగు షట్టర్లు 240 సెం.మీ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తిరువనంతపురంలోని అనేక ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిపోయింది.పతనంతిట్టలో అనతోడ్ డ్యామ్ మరియు దాని పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. డ్యామ్ షట్టర్లు త్వరలో ఎత్తే అవకాశం కనిపిస్తుంది. జిల్లాలలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అనవసరపు ప్రయాణాలు విరమించుకోవాలని సూచించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు మొదలుపెట్టాయి.

కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, కొట్టాయం, పతనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకుళం మరియు త్రిస్సూర్ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షం మరియు ఈదురు గాలులతో గంటకు 40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో గాలివాన వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వయనాడ్ జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరువనంతపురం జిల్లా కలెక్టర్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రఖ్యాత పొన్ముడి హిల్ స్టేషన్‌లోకి ప్రవేశాన్ని నిషేధించారు.కేరళలో భారీ వర్షాల నేపధ్యంలో 8606883111, 9562103902, 9447108954, 9400006700 ద్వారా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం.

English summary
Kerala has been witnessing heavy rains. With the heavy rains 1 dead in Idduki, 13 missing with a landslide in Kottayam in Koottickal panchayat, Vijayan seeks IAF help
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X