జులై రెండో వారం నుంచి దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు: అప్పటి వరకు సాధారణమే
న్యూఢిల్లీ: రుతుపవనాలతో జూన్ 18 వరకు 40 శాతం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, గత వారం రోజులుగా మాత్రం వర్షాలు తగ్గిపోయాయి. జూన్ 24 వరకు కేవలం 26 శాతం మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Recommended Video
అయితే, జులై మొదటి వారం నుంచి వర్షాలు బాగా కురుస్తాయని తెలిపింది. గురువారం భారతదేశంలో 121.2మిల్లీమీటలర్ వర్షపాతం కంటే ఎక్కువగా 152 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు మినహా దేశమంతా నైరుతి రుతుపవనాలు ఆవరించాయని తెలిపింది.

అసాధారణంగా, జూన్ నెలల ఈ కాలానికి, రుతుపవనాలు తూర్పు, మధ్య, ప్రక్కనే ఉన్న వాయువ్య భారతదేశానికి 7-10 రోజుల ముందు సాధారణం కంటే పురోగతి సాధించాయి.
అన్ని విస్తృత ఉపవిభాగాలు ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. డేటా ప్రకారం జూన్ 23 నాటికి తూర్పు, ఈశాన్య భారతదేశం 8% అదనపు, వాయువ్య భారతదేశం 58%, మధ్య భారతదేశం 46%, దక్షిణ ద్వీపకల్పం 15% వర్షపాతం నమోదయ్యాయి.
కాగా, జులై మొదటి వారం తర్వాత నుంచి దేశ వ్యాప్తంగా వర్షపాతం ఎక్కువగా నమోదు కానుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం, సెంట్రల్ ఇండియాలో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకునే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్, ఈస్ట్ ఇండియాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications