బెంగళూరులో బీజేపీ ర్యాలీ, వేల సంఖ్యలో వాహనాలు: అమిత్ షాకు ట్రాఫిక్ సెగ, అంబులెన్స్ లు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బీజేపీ పరివర్తనా యాత్ర సందర్బంగా బెంగళూరు- తుమకూరు జాతీయ రహదారిలో కిలోమీటర్ల పొడవునా వాహన సంచారం అస్తవ్యస్థం అయ్యింది. వేల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బెంగళూరు చేరుకున్నారు.

గురువారం బెంగళూరు నగర శివార్లలోని తుమకూరు రోడ్డులోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానంలో బీజేపీ పరివర్తనా యాత్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరైనారు.

Heavy traffic jam in Bengaluru Tumkur road due to BJP Parivartana Yatre

దాదాపు లక్ష మందికి పైగా బైక్ లు, కార్లలో బెంగళూరు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఒక్క సారిగా వాహనాలు నగరంలోకి రావడంతో వాహన సంచారం అస్తవ్యస్థం అయ్యింది. ట్రాఫిక్ జాం కావడంతో అంబులెన్స్ లు ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో రోగులు అల్లాడిపోయారు.

ట్రాఫిక్ జాం దెబ్బతో అమిత్ షా కెంపేగౌడ అంతర్జాతీయ విమానశ్రయంలోనే చాలసేపు ఉండిపోయారు. రోడ్డు మార్గంలో కార్యక్రమానికి హాజరుకావడం జరగనిపని అని గుర్తించిన బీజేపీ నాయకులు ప్రత్యేక హెలికాప్టర్ లో అమిత్ షాను అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానం దగ్గరకు తీసుకెళ్లారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy traffic jam in Bengaluru-Tumkur road due to BJP Parivartana Yatre in international exhibition centre, Bengaluru on November 2nd. an ambulance was stuck for hours in the traffic.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి