ముంబైలో కూలిన హెలికాప్టర్: ముగ్గురు మృతి, నలుగురు గల్లంతు

Subscribe to Oneindia Telugu

ముంబై: ఓఎన్‌జీసీ(ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) ఉద్యోగులతో ప్రయాణిస్తున్న పవన్‌ హాన్స్‌ హెలికాప్టర్‌ శనివారం ఉదయం అదృశ్యమైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురి ఆచూకీ లభ్యం కాలేదు.

ముంబైలోని జుహు విమానాశ్రయం నుంచి ఉదయం 10.20గం. టేకాఫ్‌ అయిన హెలికాప్టర్‌ షెడ్యూల్‌ ప్రకారం 10.58గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ 10.30గం. సమయంలో హెలికాప్టర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీఎస్‌)తో సంబంధాలు తెగిపోయింది. ఇందులో ఐదుగురు ఓఎన్‌జీసీ ఉద్యోగులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు.

Helicopter with ONGC employees crashes miles off Mumbai coast, 3 dead

విషయం తెలుసుకున్న ఓఎన్‌జీసీ అధికారులు వెంటనే ఇండియన్‌ కోస్ట్‌ గార్డు సిబ్బందికి సమాచారం అందించారు. హెలికాప్టర్‌ కోసం గాలింపు చేపట్టిన సిబ్బంది.. చివరికి అది కూలిపోయినట్లు గుర్తించారు.

హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు చెప్పారు. ముగ్గురి మృతదేహాలు లభ్యంకాగా.. మిగతావారి కోసం గాలింపు చేపట్టారు. ముంబై సముద్ర తీరానికి 22మైళ్ల దూరంలో ఈ హెలికాప్టర్ కూలినట్లు అధికారులు చెప్పారు. ఘటనపై పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే ప్రారంభించామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three people dead as a helicopter carrying seven people, including ONGC employees, has crashed 22 miles off Mumbai coast on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి