ఆర్టిస్ట్ హేమ హత్యలో షాకింగ్: భర్త ఏం చెప్పాడు?
ముంబై: ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హత్య కేసులో హేమా భర్త చింతన్ ఉపాధ్యాయను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించారు. ఈ విచారణలో చింతన్ షాకింగ్ విషయాలు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
హేమా హత్యతో తనకు సంబంధం లేదని చింతన్ ఉపాధ్యాయ తొలుత చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మంగళవారం అతనిని అరెస్టు చేశారు. విచారణలో అతను తన భార్యను చంపేందుకు ఎలా కుట్ర చేసింది వివరించాడు.

చింతన్ ఉపాధ్యాయ ఏం చెప్పాడు?
- ఓసారి చింతన్ అభ్యంతరకర పెయింటింగ్ వేశాడు. అది ఆయన భార్య హేమకు ఏమాత్రం నచ్చలేదు.
- తన పట్ల ఆమె వ్యవహారశైలి నచ్చలేదు.
- పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తనను కోర్టుకు లాగిన నేపథ్యంలో, న్యాయస్థానాలకు తిరగలేక అతను హేమను చంపాలని నిర్ణయించుకున్నాడు.
- హేమ - చింతన్ భార్యాభర్తలు. ఆ తర్వాత వీరి విడాకుల విషయం కోర్టు దాకా వెళ్లింది.
- 2013లోనే తొలిసారి తన భర్త చింతన్ పైన హేమ కేసు పెట్టారు. తాము వివాహం చేసుకున్న ఇంటిలోని గోడల పైన అసభ్యకర మహిళల ఫోటోలు గీస్తున్నారని పేర్కొన్నారు. అలాగే తనను వేధిస్తున్నాడని చెప్పారు.
- తాము బరోడాలో కోర్స్ చేస్తుండగా ప్రేమలో పడినట్లు పోలీసుల విచారణలో చింతన్ చెప్పారు. 1999లో పెళ్లైనట్లు చెప్పారు.
- 2013లో విడాకుల ఫైనల్ సెటిల్మెంట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు చింతన్ చెప్పాడు. లేదంటే నెలకు రూ.5 లక్షలు ఇవ్వాలని షరతు పెట్టినట్లు చెప్పాడు.
- తాను హేమను మాత్రమే చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నానని, కానీ వారు లాయర్‌ను కూడా చంపేశారని చెప్పాడని తెలుస్తోంది.
- చింతన్.. విద్యాధర్ రాజ్‌భర్‌తో కలిసి హేమను చంపేందుకు కుట్ర చేశాడు.
- విద్యాధర్... హేమను చంపేందుకు రూ.30 లక్షలు అడిగాడు. చివరకు రూ.10 లక్షల వద్ద ఒప్పందం కుదిరింది.
- సమాచారం మేరకు... హేమను, ఆమె లాయర్‌ను విద్యాధర్ రాజ్‌భర్ వేర్ హౌస్‌కు రప్పించేందుకు చింతన్ ప్లాన్ చేశాడు. ఆమెకు ఫోన్ చేయడం ద్వారా రప్పించాలని ప్లాన్ చేశారు.












Click it and Unblock the Notifications