వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకుపచ్చ సోన, ఒకటి కాదు ఆరు కోళ్ల నుంచి.. 9 నెలల నుంచి వింత, ఫోటో పోస్ట్ చేయడంతో వైరల్..

|
Google Oneindia TeluguNews

కోడి గుడ్డు సోన పసుపుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కేరళలో ఓ ఫౌల్ట్రీఫామ్‌లో కోళ్లు పెట్టే గుడ్లు ఆకుపచ్చలో ఉంటున్నాయి. అదీ కూడా ఒక కోడి కాదు.. ఆరు కోళ్ల నుంచి అలా వస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 9 నెలల నుంచి ఇలానే జరుగుతోంది. చివరికి యజమాని వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరలైంది. దీంతో నిపుణులు రంగంలోకి దిగి ఏం జరిగిందా అని ఆరాతీశారు.

ఆకుపచ్చ సోన..

ఆకుపచ్చ సోన..

మలప్పురంలో ఏకే శిహబుద్దీన్‌కు కోళ్ల ఫామ్ ఉంది. ఇతని ఫామ్‌లో కోడి పెడుతోన్న గుడ్డు ఉడికిస్తే.. పసుపు పచ్చ సోన కాకుండా.. ఆకు పచ్చ సోన వస్తుంది. ఆకు పచ్చ సోన చూసి భయపడ్డ వారు తినడానకి మాత్రం నిరాకరించారు. ఒకవేళ తీసుకుంటే అనారోగ్యానికి గురవుతామని భయపడ్డారు. ఒక కోడి నుంచి అలా వస్తుందని.. మరో కోడి నుంచి తీసిన గుడ్లను కూడా ఉడకబెట్టిన.. సేమ్ సిచుయేషన్. అలా ఆరు కోళ్ల నుంచి గత 9 నెలల నుంచి వస్తోన్న.. ఇటీవల ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రంగంలోకి శాస్త్రవేత్తలు

రంగంలోకి శాస్త్రవేత్తలు

వీడియో చూసిన కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కోళ్ల ఫామ్ వద్దకొచ్చారు. కోళ్ల ఫామ్ పరిశీలించి.. కోడి గుడ్లను, కొన్ని కోళ్లను పరిశోధన కోసం తమ వెంట తీసుకెళ్లారు. ఆకుపచ్చ సోన రావడం అనేది జన్యపరమైన లోపం వల్ల కాదు అని ఫౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ లింగ్ తెలిపారు. ఆయన చెప్పినట్టే వారి ల్యాబ్‌లో ఉంచిన కోళ్లు తర్వాత పెట్టిన గుడ్ల నుంచి పసుపు పచ్చ సోన వచ్చింది. తమ ల్యాబ్‌లో సాధారణ ఫీడ్ ఇచ్చామని.. కానీ కోడి చర్మం కింద ఆకుపచ్చ రంగుతో కూడి ద్రవ్యాన్ని గుర్తించామని తెలిపారు.

ఏం జరిగిందంటే..

రెండువారాల తర్వాత కోళ్ల ఫామ్ మొత్తంలో కూడా మార్పు వచ్చింది. గుడ్లలో ఆకుపచ్చ సోన క్రమంగా పసుపుపచ్చ వర్ణానికి మారింది. అయితే తాను కోళ్లకు ప్రత్యేకంగా ఏమీ తినడానికి పెట్టలేదని ఫౌల్ట్రీ యాజమాని తెలిపారు. సహజ మూలికల వల్ల ఇలా జరిగిందని, తెలియకుండానే ఫీడ్ లోకి మూలికలు వెళ్లి ఉంటాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకరలింగం వివరించారు.

English summary
six hens in a small poultry farm in Kerala Malappuram have laid eggs with green yolks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X